English   

దాసరి స్థానం చిరంజీవిదేనట

chiranjeevi
2020-03-19 19:47:40

దర్శకరత్న దాసరి నారాయణరావు మరణానంతరం మన టాలీవుడ్ కి పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఒకరకంగా ఆయన ఉన్నప్పుడు ఎవరిద్దరి మధ్య తేడా వచ్చినా పెద్దమనిషి తరహాలో ఆ విషయాన్ని ఆయన సెటిల్ చేసేవారు. ఆయన చనిపోయాక అలాంటి పాత్ర ఎవరూ తీసుకోలేదు. ఇప్పుడు తేడా లొస్తే వాళ్ళు మీడియాకి ఎక్కి రచ్చ చేసుకుంటున్నారు. ఈ వ్యవహారాన్ని మనం ఇంతకు ముందు మా విషయంలో చూశాం. మొన్న చిరంజీవి లాంటి వాళ్ళ ముందే రాజసేకహ్ర్ మా లో ఉన్న లుకలుకలన్నీ బయట పెట్టాడు. దాసరి మరణం తర్వాత స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? అన్న దానిపై రకరకాల చర్చలు జరిగాయి. ఆయన శిష్యుడు మోహన్ బాబు, చిరంజీవి లాంటి వారి పేర్లు వినపడినా చివరికి చిరంజీవే బెటర్ అని అంటున్నారు. ఎందుకంటే చిరంజీవి ఆ పొజిషన్ కోసం చూపిస్తున్న చొరవే అని అంటున్నారు. చిన్న సినిమా ఫంక్షన్లకు అతిథిగా హాజరవ్వడం ఎవరు పిలిచినా కాదనకుండా వెళ్లడం చేస్తున్నారు. వీలుంటే నేరుగా ఫంక్షన్ కు వెళ్తున్నారు లేదంటే టీమ్ ని ఇంటికి పిలిపించి సింపుల్ గా కార్యక్రమాన్ని చేసి పబ్లిసిటీ చేస్తున్నారు.

తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో అందరికంటే ముందుగా తన 152వ సినిమా షూటింగ్ ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి పెద్దరికం చాటుకున్నారు. ఆయన తర్వాతే మా సహా ఫిలిం చాంబర్ సమావేశం జరిపి షూటింగ్ లు నిలిపివేస్తున్నట్లు...థియేటర్లను తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. ఇలా దాసరి మరణం తర్వాత చిరంజీవే అన్ని కార్యక్రమాల్లో ముందుంటున్నారు. అదీ కాక మొన్నీమధ్య తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిరంజీవి..నాగార్జునలతో వ్యక్తిగతంతో బేటి అయిన పరిశ్రమ అభివృద్ది గురించి చర్చించడం కూడా అందుకు ఉదాహరిస్తున్నారు. చూద్దాం దాసరి తరువాత స్థానాన్ని చిరంజీవి ఏమాత్రం పదిలం చేసుకుంటారో ?  

 

More Related Stories