English   

విశ్వక్ ఇప్పుడు పాగల్ తో ఎవర్ని పాగల్ చేస్తాడో

viswaksen
2020-03-19 20:13:14

మొన్ననే ‘హిట్‌’ సినిమాతో హిట్‌ అందుకున్నాడు విశ్వక్‌ సేన్‌. ఇప్పుడు అదే జిష్ ని కంటిన్యూ చేస్తూ తన తదుపరి సినిమాని ఓపెన్ చేసేశాడు. నరేశ్‌ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ‘పాగల్‌’ ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేయగా, రానా దగ్గుబాటి క్లాప్‌నిచ్చారు. జెమిని కిరణ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఇక ముహూర్తపు సన్నివేశానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. లక్కీ మీడియా బ్యానర్ మీద బెక్కం వేణుగోపాల్‌ నిర్మిస్తున్న ఈ సినిమా మంచి లవ్ స్టోరీ అని అంటున్నారు.

నిజానికి ఈ సినిమాని ఈ నెల‌ 21 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ కి వెళదం అనుకున్నా ప్రస్తుత ప‌రిస్థితుల‌ని బట్టి షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తారని చెబుతున్నారు. ఈ సినిమాకి హీరోయిన్ ఇంకా ఫిక్స్ కాలేదు. కొందరిని సంప్రదించినా ఎవరి దగ్గరినుండి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని అంటున్నారు. క‌రోనా ఎఫెక్ట్ తగ్గితే వ‌ల్ల షూటింగ్‌ కి వెళ్ళవచ్చని చెబుతున్నారు. మొన్న ‘హిట్’ సినిమా విశ్వక్‌సేన్‌ నటనకు కూడా మంచి పీరు తెచ్చిపెట్టింది. శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఫిబ్రవరి 28న విడుదలై హిట్ గా నిలిచింది. వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌ మీద తెరకెక్కిన ఈ చిత్రానికి నాని నిర్మాతగా వ్యవహరించారు. హిట్ తో హిట్ కొట్టిన విశ్వక్ ఇప్పుడు పాగల్ తో ఎవర్ని పాగల్ చేస్తాడో ? చూడాలి.

More Related Stories