English   

బాలయ్య- బోయపాటి సినిమాకి హీరోయిన్ ఆమేనట

balakrishna
2020-03-20 06:45:08

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే సెట్స్‌ మీదకి వెళ్లగా కరోనా దెబ్బకు అది వాయిదా పడింది. ముందు నుండి అనుకుంటున్నట్టుగానే ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలలో నటిస్తారని అంటున్నారు. ఒక పాత్ర అఘోరా పాత్ర అని అంటున్నారు. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ హీరోయిన్స్ ఎవరు అనే దాని మీద రకరకాల చర్చలు జర్గుతుండగా శ్రియ లాంటి వాళ్ళ పేర్లు ప్రచారంలోకి వచ్చింది. ఇందులో ఒక హీరోయిన్ పాత్ర కోసం శ్రియ ఓకే అయినట్టు సమాచారం. బాలకృష్ణ - శ్రియ ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించి క్రేజ్ కూడా క్రియేట్ చేశారు.

మరో హీరోయిన్ పాత్ర కోసం పాయల్‌ రాజ్‌పుత్‌ నటించనుందని సమాచారం. గతంలో ఈ సినిమా యూనిట్ చాలామంది సీనియర్‌ హీరోయిల్ని సంప్రదించినట్లు వార్తలొచ్చాయి. అయితే వాళ్ల డేట్స్‌ ఖాళీగా లేకపోవడం, రెమ్యునరేషన్‌ ఎక్కువ ఉండటంతో పాయల్‌ సంప్టారదించారని టాక్‌.ఎన్టీఆర్‌ జీవితాధారంగా క్రిష్‌ తెరకెక్కించిన ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’లో బాలయ్యతో నటించింది పాయల్‌. జయప్రద పాత్రలో ఆమె నటించింది. అయితే ఈ సినిమాలో ఇద్దరు నటించనున్నారా ? లేక ఒక్కరు నటించనున్నారా అనేది తెలియాల్సి ఉంది.

 

More Related Stories