English   

నిర్మాతగా మారుతున్న కొరటాల

siva
2020-03-20 07:40:41

ఒకప్పుడు సినీ పరిశ్రమలో నిర్మాత అంటే చాలా గౌరవం ఉండేది, ఇప్పుడు వారి మీద గౌరవం తగ్గింది అనేది కొందరి వాదన. ఎందుకంటే అప్పట్లో సినిమాలు కేవలం నిర్మాత నిర్మించేవాడు. డైరెక్టర్ అంటే సినిమా మాత్రమే డైరెక్ట్ చేసేవాడు, హీరో నటించే వాడు. అయితే ఇప్పుడు సినిమా మొత్తం మారిపోయింది. డైరెక్టర్ లు, హీరోలు కూడా నిర్మాతలుగా మారుతున్నారు. దర్శకులు, హీరోలు అందరూ సొంత ప్రొడక్షన్స్ పెట్టేసుకొని వాళ్ళ సినిమాలు వాళ్ళే తీసుకుంటూ, పక్కన వాళ్ళ సినిమాలు కూడా నిర్మిస్తూ కొత్త వాళ్లకి కూడా లైఫ్ ఇస్తున్నారు. ఇప్పటికే దర్శకులు పూరి జగన్నాథ్, సుకుమార్‌ లు సొంతగా ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభించి కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు కొరటాల శివ కూడా ఈ లిస్టులో చేరనున్నారని చెబుతున్నారు. నిజానికి ఆయన ఎప్పటి నుండో నిర్మాణ రంగం మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన ఫ్ర్రెండ్ ఆల్రెడీ నిర్మాతగా మారాడు. ఇప్పుడు ఈయన కూడా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ సినిమాలు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడుగా ‘ఆచార్య’ తెరకెక్కిస్తున్నాడు కొరటాల. అయితే ఆయన సొంతగా స్టార్ట్ చేయడని ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ తో కలిపి సినిమాలు తీయాలన్న ప్లాన్ లో ఉన్నాడని అంటున్నారు. 

More Related Stories