కరోనాకు బలైపోయిన తెలుగు సినిమా రిలీజ్ డేట్స్..

కరోనా ఇప్పుడు ఇండియానే కాదు ప్రపంచాన్ని వణికిస్తుంది. రోజురోజుకీ పెరిగిపోతున్న కరోనా పేషెంట్స్‌ను చూసి జనం ఇంట్లోనుంచి బయటికి రావడానికి కూడా భయంతో చచ్చిపోతున్నారు. దాంతో మార్చ్ 31 వరకు థియేటర్స్ మూసేసారు. ఆ తర్వాత కూడా కరోనా ప్రభావం కనిపించేలా ఉంది. మరి కరోనా కారణంగా వాయిదా పడిన సినిమాలేంటో ఒకసారి చూద్దాం..
నాని వి: నాని, సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి తెరకెక్కించిన వి సినిమాను మార్చ్ 25న ఉగాది కానుకగా విడుదల చేయాలనుకున్నాడు దిల్ రాజు. కానీ కరోనా కారణంగా ఎప్రిల్కు వాయిదా పడింది ఈ చిత్రం.
వకీల్ సాబ్: పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా కావడంతో వకీల్ సాబ్పై అంచనాలు భారీగానే ఉన్నాయి. మే 15న రావాల్సిన ఈ చిత్రం జూన్‌కు వాయిదా పడినట్లు తెలుస్తుంది.
30 రోజుల్లో ప్రేమించటం ఎలా: యాంకర్ ప్రదీప్ హీరోగా మారి చేసిన సినిమా 30 రోజుల్లో ప్రేమించటం ఎలా.. నీలినీలి ఆకాశం పాటతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇప్పుడు మార్చ్ 25 నుంచి మరో డేట్‌కు పోస్ట్ పోన్ అయింది ఈ చిత్రం.
ఒరేయ్ బుజ్జిగా: రాజ్ తరుణ్ నటించిన ఈ చిత్రం కూడా మార్చ్ 25నే విడుదల చేయాలనుకున్నా కరోనా కారణంగా మరో తేదీ చూసుకోవాల్సి వచ్చింది.
నిశ్శబ్ధం: అనుష్క నటించిన నిశ్శబ్ధం ఎప్రిల్ 2న విడుదల కానుంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఈ చిత్రం కచ్చితంగా వారం వాయిదా పడేలా కనిపిస్తుంది.
ఉప్పెన: మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రం కూడా ఎప్రిల్ 2న వస్తుందని చెప్పినా.. మైత్రి మూవీ మేకర్స్ కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయాలని చూస్తున్నారు.
అర్జున: రాజశేఖర్ హీరోగా నటించిన అర్జున కూడా పదేళ్లుగా వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు మార్చ్‌లో విడుదల చేద్దామనుకుంటే కరోనా వచ్చింది. దాంతో కొత్త డేట్ చూసుకుంటున్నాడు అర్జున.