English   

బాలయ్య  బి గోపాల్ సినిమాకి ముహూర్తం ఫిక్స్

 Balakrishna
2020-03-20 12:52:47

సూపర్ హిట్ సినిమాల్ దర్శకుడు బి.గోపాల్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆయన డైరెక్ట్ చేసిన 'ఆరడుగుల బుల్లెట్' సినిమా కూడా చాలా కాలం విడుదల కాక ఆ తరువాత విడుదల అయింది. ఆ సినిమా ఎప్పుడు విడుదల అయిందో కూడా తెలియకుండా అలా వచ్చి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఆయన బాలయ్యతో ఒక సినిమా చేస్తున్నాడనే ప్రచారం అయితే జరుగుతోంది. ఈ విషయం మీద అధికారిక ప్రకటన లేకున్నా ఈ కాంబినేషన్ సినిమా ఉంటుందని అయితే అటు అభిమానులు ఇటు కామన్ ఆడియన్స్ ఇద్దరూ ఫిక్స్ అయిపోయారు.

 ప్రస్తుతానికి బాలయ్య బోయపాటి సినిమా చేస్తున్నాడు, ఈ సినిమా షూటింగ్ కరోనా ఉన్నా చేసేస్తున్నారని ప్రచారం జరుగుతుంది, అందులో నిజం ఎంత ఉందనేది తెలియదు కానీ ఈ సినిమాని వీలయినంత త్వరగా పూర్తి చేసి బీ గోపాల్ సినిమా లైన్ లో పెట్టె ఆలోచనలో ఉన్నాడట బాలయ్య. ఈ సినిమాని జూన్ 10న బాలయ్య పుట్టిన‌రోజున ప్రారంభించ‌నున్నట్లు చెబుతున్నారు. త్వర‌లోనే ఈ లక్కీ కాంబినేష‌న్ కి సంబందించిన ఈ సినిమా అధికారిక ప్రక‌ట‌న వెలువ‌డే అవ‌కాశ‌ముందని అంటున్నారు. గ‌తంలో బాలయ్య, బి గోపాల్ కాంబినేష‌న్ లో లారీ డ్రైవ‌ర్, రౌడీ ఇన్స్పెక్టర్, స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహ‌నాయుడు వంటి బ్లాక్ బ‌స్టర్స్ వ‌చ్చాయి. కానీ వారిద్దరి మధ్యా చివరిగా వ‌చ్చిన `ప‌ల‌నాటి బ్రహ్మనాయుడు మాత్రం దెబ్బ వేసింది. ఈ సినిమాని బాలయ్య సొంత బ్యానర్ ఎన్బీకే ఫిలిమ్స్ బ్యానర్ మీద తెరకెక్కించవచ్చని సమాచారం.

More Related Stories