వకీల్ సాబ్ లో పవన్ కి జోడీగా శృతి హాసన్

హిందీలో అమితాబ్ లీడ్ రోల్ లో తాప్సి కీలక పాత్రలో తెరకెక్కిన సినిమా పింక్. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో దాదాపు అన్ని బాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాని తమిల్ లో నేర్కొండ పార్వాయిగా తెరకెక్కించగా ఇప్పుడు తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా కరోనా దెబ్బకు వాయిదా పడింది. అయితే ఈ సినిమాలో పవన్ సరసన నటించే కథానాయిక ఎవరనే విషయం మీద కొన్నాళ్లుగా సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది.
ఇపటికే ఈ సినిమాలో నివేదా థామస్,అంజలి ఎంపికైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఒకటి క్రియేట్ చేసి ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే పవన్ కు ఎవరు నటిస్తారన్నదానిపై ఇప్పటివరకూ ఒక క్లారిటీ రాలేదు. మొదట శృతి హాసన్ పేరు వినిపించినా, ఆ తర్వాత ఆమె ప్లేస్‌ను ఇలియానాతో రీ ప్లేస్ చేసినట్టుగా ప్రచారం జరిగింది. వీరిద్దరూ కాదు లావణ్య త్రిపాఠి అన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఎట్టకేలకి ఈ సస్పెన్స్‌కి శృతి హాసన్ తెర దించినట్టు చెబుతున్నారు.
పవన్ సరసన మూడో సారి తాను నటించబోతున్నట్టు ఆమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నట్టు చెబుతున్నారు. ‘వకీల్ సాబ్’ సినిమాను బోనీ కపూర్ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూద్దాం.