English   

ఎన్టీఆర్ ఆది వెనుక ఎంత పెద్ద కథ ఉందో తెలుసా..

  Jr NTR
2020-03-20 13:51:01

ఆది.. ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మూతి మీద మీసాలు కూడా సరిగ్గా మొలవని జూనియర్ ఎన్టీఆర్ ఆది సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశాడు. వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లోనే దాదాపు 100 సెంటర్లలో 100 రోజులు ఆడింది. ఇక ఈ సినిమా వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఇప్పుడు బయటకు వచ్చింది. ఎన్టీఆర్ కు ఆది కథ చెప్పడం కోసం వినాయక్ ఆయన బాగా విసిగించాడు. దీని వెనక ఒక పెద్ద కహాని ఉంది. అప్పటికే సాగర్ లాంటి సీనియర్ దర్శకుల దగ్గర అసిస్టెంటుగా పనిచేసిన వినాయక్ ఎన్నో కథలు రాసుకుని చాలామంది నిర్మాతలకు హీరోలకు చెప్పాడు. 

అయితే ఏ ఒక్కటి కూడా వర్కవుట్ కాలేదు. అలాంటి సమయంలో అప్పుడే స్టూడెంట్ నెం.1 సినిమా పూర్తి చేసి బయటికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తో వినాయక్ పరిచయం ఏర్పడింది. నిర్మాత నల్లమల్లపు శ్రీనివాస్.. వినాయక్ ను అసిస్టెంట్ డైరెక్టర్ గా జూనియర్ ఎన్టీఆర్ కు పరిచయం చేశాడు. అదే సమయంలో తన దగ్గర ఎన్టీఆర్ ఇమేజ్ కు సరిపోయే ఒక కథ ఉందని వినాయక్ చెప్పడం.. అది ఆయనను కలిసి చెప్పడానికి చాలా రోజులు వేచి చూడడం జరిగిపోయాయి. అప్పటికే చాలామంది దర్శకులు జూనియర్ కోసం కథలు రాస్తామని విసిగించడంతో వినాయక్ కూడా అదే బాపతు అనుకొని వదిలేశాడు జూనియర్ ఎన్టీఆర్. 

కానీ పట్టు వదలని విక్రమార్కుడిలా బాగా సతాయించడంతో ఓ సారి కథ వినాలని పిలిపించాడు. అయితే మొత్తం కథ చెప్పకు.. ఇంట్రడక్షన్ మాత్రమే చెప్పు అని కోరిన ఎన్టీఆర్.. వినాయక్ చెప్పిన విధానం నచ్చి పూర్తి స్క్రిప్ట్ కు సరెండర్ అయిపోయాడు. దానికి ఎన్టీఆర్ ఓకే చెప్పడం వారం రోజుల్లో వినాయక్ పూర్తి స్క్రిప్టు సిద్ధం చేసుకుని రావడం ఆయన దర్శకుడిగా మారడం జరిగిపోయింది. అలా వచ్చిన సినిమా ఆది. ఆ సినిమా విడుదలైన తర్వాత ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకే దెబ్బతో వినాయక్, జూనియర్ ఎన్టీఆర్ జాతకాలు మారిపోయాయి. 

More Related Stories