English   

రామ్ చరణ్ ఆ సినిమా రీమేక్ చేస్తే చూడాలని ఉందంటున్న సుష్మిత..

Ram charan
2020-03-20 16:02:07

ఎవరు అవునన్నా కాదన్నా తండ్రి ఆస్తులు కచ్చితంగా కొడుకుకు చెందుతాయి. అలాగే పేరు ప్రతిష్టలు కూడా. ఇప్పుడు రామ్ చరణ్ రెండు ఎంజాయ్ చేస్తున్నాడు. చిరంజీవి నుంచి వచ్చిన వారసత్వానికి తన కష్టాన్ని జోడించి సూపర్ స్టార్ అయ్యాడు రామ్ చరణ్. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఎన్ని ఉన్నా కూడా చిరంజీవి సినిమాల్లో కొన్ని రీమేక్ చేయాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని రామ్ చరణ్ దగ్గర చెబితే తండ్రి చేసిన కొన్ని సినిమాలను అలాగే వదిలేయడం మంచిది.. వాటిని ముట్టుకొని అనవసరంగా నాశనం చేయడం నాకు ఇష్టం లేదని చెబుతున్నాడు. కానీ కొందరు దర్శక నిర్మాతలు మాత్రం చిరంజీవి సినిమాలు ఎప్పటికైనా రామ్ చరణ్ తో రీమేక్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. 

ఇప్పుడు ఇదే విషయం రామ్ చరణ్ అక్క సుస్మిత కొణిదెల కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. తన తండ్రి చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా రీమేక్ లో తమ్ముడు రామ్ చరణ్ నటిస్తే చూడాలని ఉందని చెప్పింది ఈమె. సుష్మిత కోరుకున్న కోరిక చాలా పెద్దది అని తెలుసు.. ఎందుకంటే తెలుగు సినిమా చరిత్రలో జగదేకవీరుడు అతిలోకసుందరి ఒక చరిత్ర.. మరపురాని చరిత్ర.. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక పేజీ రాసుకోవచ్చు. అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులన్నింటినీ తిరగరాసింది జగదేకవీరుడు అతిలోకసుందరి. 

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ముంచెత్తుతున్న వేళ కూడా కలెక్షన్లు కురిపించిన సినిమా ఇది. రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లోనే దాదాపు 8 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. ఇలాంటి సినిమాను రీమేక్ చేయడం అంటే మాటలు కాదు.. రామ్ చరణ్ కూడా ఈ సినిమా రీమేక్ లో నటించడానికి ధైర్యం సరిపోదని చెప్పాడు. అలాంటిది చిరంజీవి కూతురు మాత్రం తన తమ్ముడు ఈ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుందని చెప్పింది. మరి ఇది జరుగుతుందో లేదో చూడాలి.

More Related Stories