English   

విజయశాంతి కాదనుకున్న పాత్రలో రమ్యకృష్ణ.. ముఖ్యమంత్రిగా శివగామి..

Ramya Krishna
2020-03-20 16:08:24

సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది విజయశాంతి. ఈ సినిమా తర్వాత ఆమె మళ్లీ సినిమాలు చేస్తుందని అందరూ అనుకున్నా కూడా ఒక్క సినిమాతోనే మళ్లీ దూరమైపోయింది విజయశాంతి. దాంతో ఇప్పుడు ఈమె కోసం రాసుకున్న పాత్రలో రమ్యకృష్ణను తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా ఓ సినిమాలో ఇదే జరిగింది. సాయిధరమ్ తేజ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో  తెరకెక్కుతున్న పొలిటికల్ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె ప్రతినాయక పాత్రలో నటించబోతోందని తెలుస్తోంది. 

విలనిజం ఉంటే రమ్యకృష్ణ రప్ఫాడిస్తుందని తెలుసు. నరసింహా దీనికి నిదర్శనం. అలాంటి పవర్ ఫుల్ పాత్రలోనే ఆమె మళ్లీ కనిపించబోతుంది. మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో ఓ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ రాబోతుంది. ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటించబోతుంది రమ్యకృష్ణ. ఇందులో ముఖ్యమంత్రి పాత్రలో శివగామి నటించబోతోంది. ఇది పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే డ్రామా. శివగామి తర్వాత అంత ఇంపాక్ట్ ఉన్న పాత్ర చేయని రమ్యకృష్ణ.. ఇప్పుడు సాయి సినిమాతో మరోసారి అది చేసి చూపిస్తుందని నమ్ముతున్నారు అభిమానులు.

ఫస్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో 27 రోజుల్లో పూర్తి చేసి ఆ తర్వాత ఏలూరు, కొల్లేరు లేక్ లాంటి ప్రాంతాల్లో మిగితా షెడ్యూల్ లను పూర్తి చేయనున్నారు దర్శక నిర్మాతలు. నివేద పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది. ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటరూ సినిమాలో నటిస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. మే 1న ఈ సినిమా విడుదల కానుంది.

More Related Stories