English   

వర్క్ ఫ్రం హోం చేస్తున్న టాలీవుడ్ హీరోలు..

Tollywood
2020-03-20 16:22:58

కరోనా వైరస్ కారణంగా కార్పొరేట్ కంపెనీలతో పాటు చిన్న చిన్న కంపెనీలు కూడా ఉద్యోగులను ఆఫీసుకు రావద్దు అని చెప్పేశారు. ఇంట్లోనే ఉంటూ హాయిగా వర్క్ ఫ్రం హోం చేసుకోండి అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. ఇప్పుడు మన హీరోలు కూడా ఇదే చేస్తున్నారు. అనుకోకుండా వచ్చిన సెలవులను కుటుంబంతో పాటు ఎంజాయ్ చేసే పరిస్థితి ఎలాగూ లేదు కాబట్టి తమ సినిమాలకు సంబంధించిన హోం-వర్కు ఇంటి నుంచి చేసుకుంటున్నారు కొందరు హీరోలు. ప్రస్తుతం బాక్సర్ సినిమాలో నటిస్తున్న వరుణ్ తేజ్ తన సినిమా కోసం ఇంటి పైన శిక్షణ తీసుకుంటున్నాడు. వర్క్ ఫ్రొం హోమ్ అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు కూడా అప్ లోడ్ చేశాడు వరుణ్ తేజ్. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ నిర్మిస్తున్నాడు. కరోనా వైరస్ కారణంగా వారం రోజుల కింద ఈ సినిమా షూటింగ్ ఆపేశారు. 

ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఇంట్లోనే ఉండి కొరటాల శివ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. సినిమా షూటింగ్స్ ఆపాలి అంటూ ఇండస్ట్రీకి సూచించింది మెగాస్టార్ చిరంజీవే. ఆయన మాట మీద అందరూ సినిమా షూటింగులు. ఇక హీరో నితిన్ తన పెళ్లి పనులు ఇంటి దగ్గర ఉండే చూసుకుంటున్నాడు. మరో కొత్త పెళ్లికొడుకు నిఖిల్ కూడా పెళ్లి పనులు వేగంగా చేసుకుంటున్నాడు. కరోనా వైరస్ ఉన్నా కూడా తన పెళ్లిని ఆపలేవు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టాడు ఈయన. అతి కొద్ది మంది సమక్షంలో తన పెళ్లి జరుపుకుంటాము అని చెప్పాడు నిఖిల్. ఓ రకంగా ఈయన కూడా పెళ్లి పనులు వర్క్ ఫ్రొం హోమ్ చేస్తున్నాడు. 

పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు షూటింగ్ లు కొన్ని రోజులు పక్కనపెట్టి రాజకీయాల గురించి ఆలోచిస్తున్నాడు. రాజమౌళి కూడా ఇంటి దగ్గర ఉండి హాయిగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నాడు. ఇలా ఎవరికి వాళ్ళు హాయిగా వర్క్ ఫ్రొం హోమ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా కరోనా వైరస్ ధాటి తగ్గిపోయిన తర్వాత మళ్ళి ఇంటి నుంచి బయటికి వస్తామంటున్నారు. అప్పటివరకు అంతా వర్క్ ఫ్రమ్ హోమ్. 

More Related Stories