సీక్రేట్‌గా రెండో పెళ్లి చేసుకున్న అమలాపాల్..

ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకు ప్రేమలు, పెళ్లిళ్లు కొత్త కాదు. వాళ్లకు నచ్చినపుడు కలిసి ఉంటారు.. నచ్చకపోతే విడిపోతారు. ఎవరో అక్కడక్కడ కొన్ని జంటలు మాత్రమే ఎప్పుడూ కలిసే ఉంటారు. కానీ చాలా మంది మాత్రం ఎవరికి వారే అన్నట్లుంటారు. ఇందులో అమలాపాల్ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ నాలుగేళ్ల కింద తను ప్రేమించిన ఏఎల్ విజయ్ ను పెళ్లి చేసుకుంది. ఆ దర్శకుడితో వరస సినిమాలు చేసి చివరికి ఆయన్నే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైపోయింది అమలా. అయితే పట్టుమని రెండేళ్లు కూడా కాపురం చేయకుండానే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ విజయ్ సినిమాలతో బిజీ అయిపోయాడు.
అమలాపాల్ కూడా నటనతో బిజీ అయిపోయింది. ఈ మధ్యే మళ్లీ ఈయన రెండో పెళ్లి చేసుకున్నాడు. దీనిపై ఏం మాట్లాడటం లేదు అమలాపాల్. మరోవైపు సినిమాలు కూడా చేస్తుంది. ఈ మధ్యే ఆడై సినిమాలో నగ్నంగా నటించి సంచలనం రేపింది అమల. తను ప్రస్తుతం ప్రేమలో ఉన్నానని కొన్ని రోజుల కిందే చెప్పిన ఈమె.. ఇప్పుడు ఎవరికీ చెప్పకుండా రెండో పెళ్లి చేసుకుంది. అమలా పాల్ రెండో భర్త ముంబై బేస్డ్ సింగర్. భవ్‌నిందర్‌ను ఈమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులుగా ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారు.ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలు బయటికి వచ్చాయి. అందులో భర్తతో లిప్ లాక్ కూడా చేసింది అమలా పాల్.