English   

మలయాళ సూపర్ హిట్ సినిమా రీమేక్ రైట్స్ కొన్న నాగవంశీ...

Ayyappanum Koshiyum.jpg
2020-03-21 09:24:10

ఈ మధ్య బాష ఏదయినా మంచి సినిమా దొరకగానే ఆ రైట్స్ కొనేస్తున్నారు మన తెలుగు వాళ్ళు. తాజాగా ఫిబ్రవరిలో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన ఒక సినిమాని మన వాళ్ళు కొనేశారని అంటున్నారు. మలయాళంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్, బిజూ మీనన్‌ కథానాయకులుగా తెరకెక్కిన ‘అయ్యపనుమ్‌ కౌశియుమ్‌’ అనే సినిమా అక్కడ ఘన విజయం అందుకుంది. ఈ సినిమా తెలుగు రైట్స్ తాజాగా అల వైకుంటపురంలో సినిమాని తెరకెక్కించిన హరికా హాసినీ వాళ్ళు కొన్నారని చెబుతున్నారు. ఈ విషయాన్ని అయ్యపనుమ్‌ కౌశియుమ్‌ యూనిట్ ధృవీకరించింది.

ఇక ఈ సినిమా తమిళ రైట్స్ కూడా జిగార్తాండ, ఆడుకాలం లాంటి సినిమాలను తెరకెక్కించిన కథిరెన్ కొన్నట్టు చెబుతున్నారు. తెలుగులో ఈ సినిమాని ఎవరు తెరకేక్కిస్తారు, ఎవరిని హీరోగా పెడతారు అనే విషయం మీద ఇంకా క్లారిటీ లేదు.

ఇప్పుడేమో తమిళ్ లో ఈ సినిమాని సూర్య, కార్తిలతో తీస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంలో నటిస్తున్నాడు. తదుపరి హరి దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నాడు. మరోపక్క సూర్య ఏమో మణిరత్నం దర్శకత్వంలో వస్తోన్న ‘పొన్నియన్‌ సెల్వన్‌’తో బిజీగా ఉన్నాడు కార్తి.

More Related Stories