English   

డాక్టర్ బాబుగా మారనున్న సాయి ధరమ్ తేజ్ 

Sai Dharam Tej
2020-03-21 10:29:53

అదేంటి తేజ్ డాక్టర్ బాబుగా మారడం ఏమిటా ? అని కార్తీక దీపం సీరియల్ లోకి వెళ్ళకండి. తేజ్ తరువాతి సినిమాలో డాక్టర్ పాత్ర పోషించనున్నట్టు చెబుతున్నారు.  దాదాపు అరడజను సినిమాల ఫ్లాప్లు కొట్టాక చిత్రలహరి అనే సినిమా ద్వారా తేజూ మళ్ళీ ట్రాక్ లో పడ్డాడు. ఆ తరువాత తెరకెక్కించిన ప్రతిరోజూ పండగే సినిమా ద్వారా మరో హిట్ కొట్టి మళ్ళీ మార్కెట్ లో నిలబడ్డాడు. ఇప్పుడు మనోడు హీరోగా సోలో న్రతుకే సో బెటరూ అనే సినిమా తెరకెక్కుతోంది. సుబ్బు అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని తెరకేక్కిస్తున్నాడు. ఈ సినిమా మే 1న విడుదల కావాల్సి ఉన్నా, ఇప్పుడు ఈ కరోనా వలన వాయిదా పడే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. 

అయితే ఆ సంగతి పక్కన పెడితే మొన్ననే ప్రస్తానం లాంటి అవార్డ్ విన్నింగ్ సినిమాని తెరకెక్కించిన దేవా కట్టా డైరెక్షన్ లో ఒక సినిమా ఓపెనింగ్ జరిగింది. ఇప్పుడు ఆ సినిమాలోనే మనోడు డాక్టర్ బాబు అవతారం ఎత్తనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇది ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ అని అంటున్నారు. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న ఒక పవర్ ఫుల్ ముఖ్యమంత్రి పాత్రలో రాజమాత రమ్యకృష్ణ నటించబోతోందని అంటున్నారు. 

ఏలూరు నేపధ్యంలో సాగే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో 27 రోజుల్లో పూర్తి చేస్తారట. ఆ తర్వాత ఏలూరు ఆశ్రం మెడికల్ కాలేజ్, కొల్లేరు లాంటి ప్రాంతాల్లో మిగితా షెడ్యూల్ లను పూర్తి చేయనున్నారని అంటున్నారు. నివేద పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా ముందు ఆగస్టులో విడుదల చేయాలనుకున్నా అది కరోనా వలన ఏడాది చివరికి జరిగే అవకాశం ఉంది. 

More Related Stories