English   

సూపర్ స్టార్ రజనీని డైరెక్ట్ చేయనున్న లారెన్స్ 

 Raghava Lawrence
2020-03-21 10:36:38

కొరియోగ్రాఫర్ గా ఎంటర్ అయి డైరెక్టర్‌ గా మారిన రాఘవ లారెన్స్‌ తనకి తాను రజనీకాంత్‌కి వీరాభిమానినని చెప్పుకుంటూ ఉంటాడు. గతంలో రజనీకి ఒకసారి అనారోగ్యం చేసింది, చాలా సీరియస్ కూడా అయింది. అప్పుడు లారెన్స్ చెన్నైలోని రాఘవేంద్రస్వామి మఠంలో ఐదురోజుల యాగం కూడా చేశారు. ఆ ఐదురోజుల పాటు వెయ్యి మందికి నిత్యాన్నదానం కూడా చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. అలాంటి వీరాభిమానికి ఇప్పుడు రజనీని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందట. రజనీకాంత్‌ చేయబోయే తరువాతి సినిమాల్లో లారెన్స్‌ సినిమా కూడా చేరిందనే టాక్ ఇప్పుడు కోలీవుడ్ ఫిలిం వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. 

రజనీ ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’ అనే సినిమా చేస్తున్నారు. అది రజనీ కి 168వ సినిమా. ఆ తర్వాత కమల్‌హాసన్‌ సొంత బ్యానర్‌లో 169వ సినిమా చేసేందుకు ఆయన కమిట్‌ అయ్యారు. ఆ సినిమా లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో వస్తుందని ప్రచారం జరిగింది. దీంతో ఇప్పుడు రాఘవ లారెన్స్‌ సినిమా 170వ సినిమా అవుతుందని టాక్‌. ప్రస్తుతం రజనీ రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇస్తున్నానని ప్రకటించారు. దీంతో ఎక్కువగా పొలిటికల్ సబ్జెక్ట్స్ మాత్రమె చేయచ్చానే టాక్ వినిపిస్తోంది. మరో పక్క రాఘవ లారెన్స్‌ దర్శకుడిగా హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా ‘లక్ష్మీబాంబ్‌’ సినిమా తెరకెక్కిస్తున్నారు.

More Related Stories