English   

సాయి పల్లవిని చూస్తే భయపడుతున్న స్టార్ హీరోలు..

 Sai Pallavi
2020-03-21 12:32:38

సాయి పల్లవితో ఒక్క సినిమా అయినా చేయాలని శేఖర్ కమ్ముల ఫిదా సినిమా చేసిన తర్వాత చెప్పాడు. ఆమె లాంటి నటితో పని చేయాలని ప్రతీ దర్శకుడు కోరుకుంటాడని హను రాఘవపూడి పడిపడి లేచే మనసు సినిమా తర్వాత స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏఎల్ విజయ్ అయితే సాయి పల్లవి లాంటి నటిని తాను చూడలేదని కణం సినిమా తర్వాత చెప్పాడు. దర్శకులతో ఇలాంటి ప్రశంసలు అందుకున్న సాయి పల్లవి పేరు వింటే ఇప్పుడు హీరోలు మాత్రం భయపడుతున్నారు. ఈమెతో నటించడానికి ఆలోచిస్తున్నారు. 

ముఖ్యంగా సాయి పల్లవి షూటింగ్ కు టైమ్ కు రాదంటూ నాగ శౌర్య అప్పట్లో చేసిన కామెంట్స్ అందరికీ గుర్తుండే ఉంటాయి. ముఖ్యంగా ఆమెకు తలపొగరు అని చెప్పాడు ఈయన. ఇక ఎంసిఏ టైమ్ లో నానితో కూడా ఈమెకు గొడవైందనే వార్తలు వచ్చాయి. దాంతోపాటు కణం సినిమా సమయంలో కూడా కొన్ని వివాదాలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఈమె నాగ చైతన్యతో లవ్ స్టోరీ సినిమాలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో మొదటి పాటను విడుదల చేసింది చిత్రయూనిట్. 'హే పిల్లా' అంటూ సాగే ఈ పాట బాగానే ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కవుట్ అవుతుంది. 

అయితే ఇందులో కొన్ని సన్నివేశాల్లో పల్లవి ముందు చైతూ తేలిపోయాడని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డాన్సుల దగ్గర సింగిల్ టేక్ లో సాయి పల్లవి దుమ్ము లేపుతుంటే చైతూ మాత్రం 10 టేకులు తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. దర్శకుడు శేఖర్ కమ్ములతో పాటు హీరో కూడా తన స్పీడ్ తగ్గించమని చెప్పినా వినిపించుకోకుండా సాయి పల్లవి ప్రవర్తించిన తీరుతో చైతన్య బాగా ఫీల్ అయ్యాడని తెలుస్తుంది. ఫిదా సినిమాలో కూడా వరుణ్ తేజ్ ను పూర్తిగా డామినేట్ చేసింది సాయి పల్లవి. ఆ సినిమా హిట్టైనా కూడా వరుణ్ తేజ్ కు పేరు రాలేదంటే పల్లవి డామినేషన్ అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈమె పేరు వింటే భయపడిపోతున్నారు ఇప్పుడు మన హీరోలు. 

More Related Stories