English   

కరోనా వైరస్ పై క్లాస్ తీసుకున్న హీరోయిన్ త్రిష..

 Trisha
2020-03-21 15:25:19

ప్రపంచవాన్ని వణికిస్తున్న కరోనా భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే చాలా మంది సినిమా సెలబ్రిటీలు వీడియోల రూపంలో చెప్పారు. మంచు లక్ష్మి,  చిరంజీవి, పవన్ కళ్యాణ్  ఇలా చాలామంది బయటకు వచ్చి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అన్ని ప్రభుత్వాలు కూడా కరోనా వైరస్ నియంత్రణ కోసం పాటు పడుతున్నాయి. ఇక ఇప్పుడు హీరోయిన్ త్రిష ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. యునిసెఫ్‌ ఇండియా దౌత్య అధికారిగా ఆమె వ్యవహరిస్తుంది. 

ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఆమె మాట్లాడుతూ కరుణ వైరస్ నుంచి మనకు మనం ఎలా కాపాడుకోవాలో ఇందులో సూచించింది. కరోనా నుంచి మనల్ని మనమే రక్షించుకోవాలి.. మీకు తుమ్ము, దగ్గు వస్తే వెంటనే కర్చీఫ్‌ లేదా టిష్యూ పేపర్‌ అడ్డు పెట్టుకోండి అంటూ కొన్ని జాగ్రత్తలు చెప్పింది త్రిష. దాంతో పాటు ఒకసారి వాడుకున్న కర్చీఫ్‌, టిష్యూ పేపర్‌ను చెత్తకుప్పలో పడేసి మూసి ఉంచాలని తెలిపింది. కన్ను, ముక్కు, నోటిని అనవసరంగా తాకకండి అంటూ జాగ్రత్తలు చెప్పింది త్రిష. 

అప్పుడప్పుడు 20 సెకన్ల పాటు సోపుతో చేతులను శుభ్రం చేసుకోండి.. జనం ఉన్న ప్రాంతానికి వెళ్లకండ అంటూ హెచ్చరించింది. దగ్గు, జ్వరం ఉంటే ఇతరులతో మాట్లాడటం తగ్గించాలని.. ఏమాత్రం అనుమానంగా ఉన్నా వెంటనే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లండి అంటూ సూచించింది. ఆ సమయంలో తప్పకుండా మాస్క్‌ను ధరించడం మరచిపోవద్దని పేర్కొంది. త్రిష ఇంతగా చెబితే దాన్ని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు. 

More Related Stories