English   

జబర్దస్త్ షోలో కనిపించని రోజా.. మళ్లీ కొత్త జడ్జి..

Roja
2020-03-21 16:21:24

జబర్దస్త్ కామెడీ షో నుంచి నాగబాబు వెళ్లిపోయిన తర్వాత ఆ బాధ్యత మొత్తం ఒంటరిగా మోస్తుంది రోజా. అయితే అప్పుడప్పుడు మధ్యలో మళ్లీ మిస్ అయిపోతుంది ఈమె. ఓ వైపు రాజకీయాలతో పాటు మరో వైపు జబర్దస్త్ ను కూడా బ్యాలెన్స్ చేయడం కష్టమే కానీ చేస్తుంది ఈమె. అయితే ఎంత బ్యాలెన్స్ చేసినా కూడా కొన్నిసార్లు మిస్ అవ్వక తప్పడం లేదు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. వచ్చే వారం ఎపిసోడ్ లో రోజా కనిపించడం లేదు. ఆమె స్థానంలో శేఖర్ మాస్టర్ కనిపించాడు. ఇదిలా ఉంటే ఈ మధ్య రోజాపై పంచులు ఎక్కువైపోతున్నాయి. ఏం చేసైనా కూడా కామెడీ రాబట్టవచ్చని సర్వహక్కులు కమెడియన్స్ కు ఇచ్చేసారు మల్లెమాల ప్రొడక్షన్స్. దాంతో వాళ్లు రెచ్చిపోతున్నారు. 

మరీ ముఖ్యంగా జడ్జి రోజా పైన దారుణమైన పంచులు వేస్తున్నారు. హైపర్ ఆది సుడిగాలి సుదీర్ లాంటి టీం లీడర్స్ రోజా చేస్తున్న బతుకు జట్కాబండి ప్రోగ్రాంతో ఆడుకుంటున్నారు. కావాలనే మాటిమాటికి జబర్దస్త్ లో ఈ తరహా స్కిట్ లు చేసి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నారు. జీ తెలుగులో బతుకు జట్కాబండి మంచి పేరుంది. విడిపోయే జంటలను న్యాయనిర్ణేతగా కూర్చుని కలపడం ఈ ప్రోగ్రాం కాన్సెప్ట్. దీన్ని ఇప్పుడు జబర్దస్త్ లో కిచిడి చేస్తున్నారు కమెడియన్లు. మొన్నటికి మొన్న హైపర్ ఆది ఇలాంటి స్కిట్ ఒకటి చేశాడు. ఆ మధ్య న్యూ ఇయర్ ఈవెంట్ లో కూడా సుడిగాలి సుదీర్ ఇలాంటి స్కిట్ ఒకటి చేశాడు. పైగా దానికి రోజా సపోర్ట్ చేయడం గమనార్హం. ఏదేమైనా కూడా జబర్దస్త్ లో రోజా పైనే ఎక్కువ సెటైర్లు పడుతున్నాయి. దానికితోడు రోజా కూడా మధ్యలో మిస్ అవుతూ వస్తుంది. 

More Related Stories