English   

మెగాస్టార్ ను కాదని రవితేజతో సినిమా చేస్తున్న త్రిష 

Trisha
2020-03-21 16:59:42

సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయడం నుండి ఇప్పుడు ఏకంగా హీరో స్థాయికి ఎదిగాడు హీరో రవితేజ. ఒకప్పుడు రవితేజ సినిమాలంటే మినిమం గ్యారంటీ ఉండేది అటు నిర్మాతలకి, ఇటు దిస్త్రిబ్యుటర్ లకి కానీ ప్రస్తుతం రవితేజ కెరీర్ ఏమంత బాలేదు. ఈ హీరో నటించిన లాస్ట్ నాలుగు సినిమాలు భారీ డిజాస్టర్ లుగా నిలవడంతో ఈయనతో సినిమా చేసే వాళ్ళు తగ్గిపోయారు. ఎలాగైనా హిట్ కొట్టాలి అని ఇంకా విక్రమార్క ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు  రవితేజ. అయితే ఇన్ని ప్లాపులు వస్తున్నా రవితేజకు ఎవరో ఒకరు మాత్రం ఛాన్స్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమాను చేస్తోన్న రవితేజ, రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మరో సినిమాను కూడా లైన్లో పెట్టాడు. అయితే ఇంకా షూట్ కి వెళ్ళని ఈ సినిమాలో రవితేజకు జోడీగా మాళవిక శర్మను ఎంపిక చేశారని ఒకసారి, ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ని ఎంపిక చేశారని ఒకసారి ఇలా రకరకాలుగా ప్రచారం జరిగింది.

అయితే తాజాగా ఈ సినిమాలో వీరిద్దరూ కాదని ఈ సినిమాలో నటించడానికి త్రిషతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ చిత్రానికి ‘కిలాడీ’ అనే పేరు పెట్టచ్చని అంటున్నారు. కోనేరు సత్యనారాయణ, హీరో హవీష్ లు నిర్మిస్తున్న ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో షూట్ కి వెళ్లనుంది. గతంలో రవితేజ త్రిషలు వీవీ వినాయక్ తెరకెక్కించిన కృష్ణ అనే సినిమా చేశారు. ఈ సినిమా ఆరోజుల్లో సూపర్ హిట్ అయింది. మొన్ననే త్రిష మెగాస్టార్ సినిమా నుండి బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈ సినిమా ఒప్పుకుంటే మెగాస్టార్ సినిమాని కాదని రవితేజతో సినిమా చేస్తున్న త్రిష అనే ప్రచారం చేసినా చేస్తారు.
 

More Related Stories