English   

కరోనా వచ్చిందని ప్రేయసిని వదిలేసిన ప్రియుడు.. 

Olga Kurylenk
2020-03-21 17:06:27

కరోనాతో ప్రస్తుతం ప్రపంచం వణికిపోతుంది. అది రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా రాకుండా మాత్రం ఆగడం లేదు. ఎప్పుడు ఎవరికి సోకుతుందో తెలియక భయపడుతున్నారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. విద్యాసంస్థలు, పార్క్‌లు, జిమ్ములు, సినిమా థియేటర్లు, జనం రద్దీగా ఉండే ప్లేసులు, దేవాలయాలతో పాటు అన్నీ మూసేయాలని ఆర్డర్ పాస్ చేసింది. దానికితోడు సినిమా వాళ్లు కూడా ఇంటి నుంచి బయటికి రాకుండా సెల్ఫ్ క్వారెంటైన్ చేసుకున్నారు. అంటే ఇంట్లోనే ఉండి హౌజ్ అరెస్ట్ అన్నమాట. ఇంత చేసినా కూడా జేమ్స్ బాండ్ నటి ఓల్గా కురిలెంకోకి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇది జరిగి కూడా వారం రోజులు అయిపోతుంది.

అయితే ఇప్పుడు ఈమెకు నయం అయిపోయింది. దానికి సంబంధించిన లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అభిమానులతో పంచుకుంది ఓల్గా. తన విషయంలో జరిగిన తప్పు ఎవరూ చేయొద్దంటూ సోషల్ మీడియాలో అభిమానులను కోరుకుంటుంది ఈమె. తన అనుభవాన్ని చెప్తూ ఇంట్లో ఎవర్నీ మన దగ్గరకి రానీవ్వొద్దని చెబుతుంది. కరోనా సోకితే అది ఎవరికి సోకకుండా క్వారెంటైన్ చేసుకోవాలని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. విటమిన్ బీ5.. విటమిన్ ఈ.. విటమిన్ సీ.. జింక్ ఎంతగానో సహకరిస్తాయని.. ఇవి వాడిన తర్వాతే తనకు జ్వరం కూడా తగ్గిందని చెప్పింది బాండ్ గాళ్. తనకు డాక్టర్లు పారాసెటమాల్ తప్ప ఇంకేం ఇవ్వలేదని.. జాగ్రత్తలు చెప్పలేదని మండిపడింది ఓల్గా. కరోనాని ధైర్యంగా ఎదుర్కోవడాన్ని చూసి ప్రేక్షకులు కూడా ఆమెను అభినందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈమెకు కరోనా వచ్చిందని తెలిసి బాయ్ ఫ్రెండ్ బెన్ క్యూరా వదిలేసాడనే ప్రచారం కూడా జరుగుతుంది. 

More Related Stories