English   

అనుష్క ప్రేమ మీద క్లారిటీ ఇచ్చినా..వదలట్లేదుగా

anushka
2020-03-22 08:27:05

అనుష్క ప్రేమ అనే విషయం ఎప్పుడయినా తక్కువగా హైలైట్ అవుతుంది కానీ, అనుష్క పెళ్లి అనే వార్త మాత్రం ఆమెకు ఎప్పుడూ ఏదో ఒక తలనొప్పి ఉంటది. అనుష్కకు ప్రభాస్ తో పెళ్లి,లేదా ఫలానా సీనియర్ దర్శకుడి కొడుకుతో పెళ్లి, అనుష్కకి ఫలానా వ్యక్తితో పెళ్లి అనే లాంటి వార్తలను గతకొన్ని సంవత్సరాలనుండి వింటూనే ఉన్నాం. ప్రభాస్‌ తో ప్రేమలో ఉందని ఒకసారి ఒక క్రికెటర్‌ తో రిలేషన్‌షిప్‌ త్వరలో పెళ్లి అని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ విషయాల మీద ఎప్పుడూ ఆమె పెద్దగా స్పందించింది లేదు. కానీ మొన్నీమధ్య తన పెళ్లి విషయం మీద అయితే క్లారిటీ ఇచ్చేసింది. తమ తల్లితండ్రులు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటా అని చెప్పేసింది. ఇక తాజాగా తన విషయంలో వస్తున్న పుకార్ల మీద కూడా స్పందించింది స్వీటీ. తన లైఫ్ లో ఉన్న  ప్రేమ గురించి చెప్పుకొచ్చింది. 2008లో ఓ వ్యక్తిని ప్రేమించానని అది ఒక తీయని ప్రేమ అని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఆ ప్రేమ కొనసాగలేదని కొన్ని అనివార్య పరిస్థితుల్లో విడిపోయామని చెప్పారు. తాను ప్రేమించిన ఆ వ్యక్తి ఎవరన్నది చెప్పడం ఇష్టం లేదని ఆమె చెప్పడం ఇప్పుడు మళ్ళీ అనేక ఊహాగానాలకి తావిచ్చినట్టు అయ్యింది. అనుష్క లవ్ చేసింది టాలీవుడ్ కి చెందిన ఒక ప్రముఖ హీరోనే అని మళ్ళీ చర్చ మొదలయింది. అప్పట్లో వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో కూడా నటించారని, అప్పట్లో ఆ హీరోతో చెట్టాపట్టాలు వేసుకుని మరీ తిరిగిందని మళ్ళీ ప్రచారం చేస్తున్నారు.

 

More Related Stories