English   

చిరంజీవి, బాలయ్య ఇద్దరూ కావాలంటున్న అనిల్ రావిపూడి..

chiru
2020-03-22 08:47:54

ఈ రోజుల్లో ఒక హిట్ సినిమా తీయడమే కష్టంగా మారిపోతుంది. అలాంటిది వరుసగా ఐదు విజయాలు అందించాడు అనిల్ రావిపూడి. రచయితగా ఒక్క సక్సెస్ కూడా లేకపోయినా దర్శకుడిగా మారిన తర్వాత ఆయనకు ఎదురు లేకుండా పోయింది. వరుస విజయాలతో ప్రేక్షకుల పల్స్ బాగా పట్టుకున్నాడు ఈయన. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఏకంగా 130 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి మహేష్ బాబు కెరీర్లో అతి పెద్ద విజయాన్ని అందించాడు ఈ కుర్ర దర్శకుడు. దాంతో అనిల్ రావిపూడి కోసం ఇప్పుడు స్టార్ హీరోలు కూడా వేచి చూస్తున్నారు. మరోవైపు తన మనసులో కూడా కొందరు హీరోలను డైరెక్ట్ చేయాలని ఉందంటూ చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. తరుణ్ భాస్కర్ నీకు మాత్రమే చెప్తా షోకు అతిథిగా వచ్చిన అనిల్ రావిపూడి చాలా విషయాల గురించి క్లారిటీ ఇచ్చాడు. రెండు ఎపిసోడ్లుగా ఈ షో ప్రసారమైంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు ప్రొఫెషనల్ ఈ విషయాలను కూడా చాలా వరకు పంచుకున్నాడు అనిల్ రావిపూడి. అందులో మరీ ముఖ్యంగా మీకు ఏ హీరోతో పని చేయాలని ఉందని అడిగితే జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పాడు అనిల్. ఆ తర్వాత తనకు బాలకృష్ణ, చిరంజీవిని కూడా డైరక్ట్ చేయాలని ఉంది అంటూ మనసులో మాట బయట పెట్టాడు ఈ కుర్ర దర్శకుడు. ఏ హీరోతో పని చేస్తే అభిమానులు చూడాలనుకుంటున్నారు అని ఒక సర్వే కండక్ట్ చేస్తే అందులో చాలామంది బాలకృష్ణ పేరు చెప్పారు. నిజానికి బాలకృష్ణతో రామారావు గారు అని ఒక సినిమా అనుకున్నాడు అనిల్ రావిపూడి. కానీ అప్పట్లో అది కార్యరూపం దాల్చలేదు. భవిష్యత్తులో ఎప్పుడూ అవకాశం దొరికిన బాలకృష్ణతో సినిమా చేస్తాను అంటున్నాడు అనిల్ రావిపూడి. మరోవైపు చిరంజీవితో సినిమా చేయడం తన కల అంటున్నాడు ఈయన. మొత్తానికి ఈ కుర్రాడు జోరు చూస్తుంటే ఇండస్ట్రీలో ఏ హీరోను కూడా వదిలిపెట్టేలా కనిపించడం లేదు.

More Related Stories