English   

మేనేజర్ ని ఫైర్ చేసిన పాయల్ రాజ్ పుత్...కారణం అదే

payal
2020-03-22 08:52:47

ఆర్ఎక్స్ 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్. ఈ సినిమాలో ఆమె చేసింది నెగటివ్ రోల్ అయినా ఆ సినిమా హిట్ కావడం అందులో ఈ అమ్మడి రోల్ బాగుండడంతో ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది. ఈ దెబ్బకు ఆమెకు ఆఫర్స్ వెల్లువలా వచ్చి పడతాయని భావించారు. అయితే ఈమె చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ వెళ్ళడం ఆ చేసిన సినిమాలు కూడా ఫట్ మనడంతో కొంచెం ఆఫర్స్ అనేవి తక్కువగానే ఉన్నాయి. ఆరేక్స్ 100 తర్వాత ఆమె చేసిన ఆర్ డి ఎక్స్ 100, అలాగే వెంకీమామలో వెంకటేష్ సరసన నటించినా పెద్దగా ఈమె కెరీర్ కి ప్లస్ కాలేదు. మొన్నామధ్య రవితేజతో డిస్కో రాజాలో చేసినా అది పెద్దగా ప్లస్ కాలేదు. అయితే మంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న పాయల్ రాజ్ పుత్ కి ఇప్పుడు ఏకంగా బాలయ్యతో నటించే అవకాశం వచ్చినట్టు చెబుతున్నారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఆమె గురించిన ఒక విషయం మాత్రం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే ఆమె తన మేనేజర్ ని పనిలో నుండి తీసేసిందట. అయితే విషయం ఏమిటంటే ఈమె వద్ద సతీష్ అనే ఆయన మేనేజర్ గా పనిచేసేవాడు. అయితే ఈమె పేరు చెప్పి ఆయన కొందరు ప్రొడ్యూసర్స్ వద్దా, అలాగే మరికొందరు మేనేజర్ల వద్దా డబ్బు గుంజినట్టు ఈమె దృష్టికి వచ్చిందట. పాయల్ డేట్స్ ఇప్పిస్తాననే వంకతో ఆ డబ్బు తీసుకుని ఆ విషయం తన దగ్గర దాచడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇది సంపాదించే వయసు, కొంచెం మంచి వాళ్ళని చూసి పనిలో పెట్టుకోకుంటే ఇదిగో ఇలానే నవ్వుల పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.

 

More Related Stories