English   

జనతా కర్ఫ్యూ మీద పవన్, రజనీ ట్వీట్లు..ఫేక్ అంటూ తొలగించిన ట్విట్టర్

Rajanikanth Pawan Kalyan.jpg
2020-03-22 10:09:00

కరోనా వైరస్ ఊహించని విధంగా హద్దులు దాటుతోంది. రెండు రోజుల వ్యవధిలోనే వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే కరోనా ఏ రేంజ్‌లో విజృంభిస్తుందో అర్ధచేసుకోవచ్చు. ప్రస్తుతం దేశమంతా కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. అయితే ఈ సమయంలో సెలబ్రిటీలు కూడా సొంతంగా హౌజ్ అరెస్ట్ చేసుకుంటూ అభిమానులకు సందేశాలు అందిస్తున్నారు. ఆ బాష ఈ బాష అని లేకుండా అన్ని బాషల నటులు, స్టార్ లు, తమ తమ అభిమానులకి ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు.

అలా ఈ విషయాల మీద అలాగే మోడీ పిలుపునిచ్చిన నటుల్లో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌, పవర్ స్టార్, పవన్‌ కళ్యాణ్‌ లు కూడా ఉన్నారు. అయితే అందరూ ఈ విషయం గురించి చెబుతోంటే వీరిద్దరి గురించే ఎందుకు ప్రస్తావిస్తున్నారు అంటే వారిద్దరూ జనతా కర్ఫ్యూ గురించి చేసిన ట్వీట్ లను ట్విట్టర్ తొలగించింది. ఎందుకా అని ఆరా తీస్తే వీరు చేసిన ట్వీట్లలో ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉందని, అందుకే వాటిని తొలగించామని ట్విట్టర్ యాజమాన్యం చెబుతోంది. వీరి చేసిన ట్వీట్లలో 12 గంటల్లో కరోనా వైరస్ చనిపోతుందని ఉంది.

రజనీ, పవన్ ఇద్దరూ తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ట్విట్టర్‌ యాజమాన్యానికి పలువురు రిపోర్ట్ కోట్టారట. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఆ ట్వీట్లు తొలగించింది ట్విట్టర్. ఇక ఈ ఇద్దరు నటులు మోడీకి ముందు నుండీ సపోర్ట్ చేస్తున్నారు. జనసేనాని ఇప్పుడు బీజేపీ పొత్తులో ఉండగా, రజనీ తమిళనాడు బీజేపీ బీటీమ్ అనే ప్రచారం కూడా ఉంది.

More Related Stories