English   

ఆగిన శౌర్య సినిమా...క్రియేటివ్ డిఫరెన్సెస్...

Naga Showrya Laxmi Sowjanya.jpg
2020-03-22 11:47:16

యంగ్ హీరో నాగశౌర్య వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెట్టేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ‘అశ్వథ్థామ‌’ సినిమాతో వచ్చిన నాగశౌర్య డీసెంట్ హిట్ కొట్టాడు. ఇప్పుడు ఆ సినిమా అయిపోయిన వెంటనే మరో రెండు సినిమాలను మీదకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఒకటి, మరొకటి ఏమో ఎప్పుడో ఆగిపోయిన రాజా అనే దర్శకుడి సినిమా కూడా లైన్ లో పెట్టాడు.

అయితే అందుతున్న సమాచారం మేరకు లక్ష్మీ సౌజన్యతో సినిమాలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయట. ఆమెకి నిర్మాతకు మనస్పర్ధలు వచ్చాయని అంటున్నారు. అది కూడా సినిమా టేకింగ్ విషయంలో క్రియేటివ్ డిఫరెన్స్లు వచ్చాయని ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమా ప్రారంభిత్సవం జరిగి ఇంకా నెల కూడా సరిగ్గా పూర్తి కాలేదు. రీతువర్మ హీరోయిన్ గా ఈ సినిమాని ఫిబ్రవరి 13న లాంచ్ చేశారు. అదేనెల 19 నుండి షూట్ కి కూడా వెళ్లారు. అయితే నిర్మాత ఏకంగా సినిమా ఆపేద్దామని కూడా అన్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో శౌర్య కల్పించుకుని వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

More Related Stories