కరోనా ఎఫెక్ట్...దేవరకొండ బ్రదర్స్ అలా ప్లాన్ చేశారు...

కరోనా వైరస్ కారణంగా ఎవరు ఇంటి నుంచి బయటికి రావడం లేదు. దానికి తోడు మార్చి 22న జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ కోరాడు. మన దేశానికి వచ్చిన ఈ వైరస్ ధైర్యంగా ఎదుర్కోవాలి అంటూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. దాంతో సినిమా ఇండస్ట్రీ అంతా కదిలి వస్తుంది. ఈ మహమ్మారిని మనకు మనమే ఎదుర్కోవాలని.. ధైర్యంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంటి నుంచి అడుగు బయట పెట్టకుండా హౌస్ అరెస్ట్ చేసుకోవాలని కొందరు సెలబ్రిటీలు చేసి చూపిస్తున్నారు. అందులో దేవరకొండ బ్రదర్స్ కూడా ఉన్నారు.
కరోనా వైరస్ కారణంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫైటర్ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి ఆపేశారు. దాంతో హాయిగా ఇంట్లోనే ఉండి కుటుంబంతో సమయం గడుపుతున్నాడు విజయ్ దేవరకొండ. తన తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి చెస్ ఆడుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
తమ్ముడితో కలిసి సీరియస్ గా చెస్ ఆడుతున్న విజయ్ దేవరకొండను చూసి ఫిదా అయిపోతున్నారు అభిమానులు. మీరు కూడా నాలాగే ఇంట్లోనే ఉండండి అంటూ ఆటతో సమాధానం చెప్పాడు ఈయన. మరోవైపు దొరసాని సినిమా తర్వాత రెండో సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు ఆనంద్ దేవరకొండ.