English   

బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మిక

Rashmika.jpg
2020-03-22 19:59:26

ఛలో సినిమాలో మూవీతో తెలుగు తెరకి పరిచయమైన రష్మిక మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో నటించిన గీత గోవిందం మూవీ బంపర్ హిట్ కావడంతో ఆమె క్రేజీ హీరోయిన్ గా మారింది. స్వతహాగా కన్నడ నటి అయిన ఆమె ఈ రెండు ఇండస్ట్రీలలో సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఈ మధ్య కాలంలో మహేశ్ బాబు, నితిన్ లతో చేసిన రెండు సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి. దీంతో ఇప్పుడు ఆమె తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ తో పాటు గోల్డెన్ లెగ్ అనే స్టేటస్ కూడా అనుభవిస్తోంది. గోల్డెన్ లెగ్ అనే పేరు పడడంతో ఆమెకు ఆఫర్లు ఇవ్వడానికి స్టార్ హీరోలు సైతం ఉవ్విళ్ళూరుతున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్‌, సుకుమార్‌ సినిమాలో నటిస్తున్న రష్మిక తమిళంలో కార్తి హీరోగా నటిస్తున్న `సుల్తాన్‌`లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. రష్మకి ఇది మొదటి తమిళ సినిమా. అయితే అందుతున్న సమాచారం మేరకు రష్మికకు మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్టు చెబుతున్నారు. అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ ఆచార్యలో రామ్‌చరణ్ కీలక అతిథి పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. ఇందులో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోండగా చరణ్‌కు జోడీగా రష్మికని యూనిట్ సంప్రదించినట్టు చెబుతున్నారు.  ఈ పాత్ర కోసం కియారా అద్వానీ సహా సమంత, పూజా హెగ్డే లాంటి వాళ్ళ పేర్లు వినిపించాయి. చివరికి రష్మిక ఫైనల్ చేసినట్టున్నారు దర్శక నిర్మాతలు.

More Related Stories