English   

బాలయ్యతో సినిమా...క్లారిటీ ఇచ్చిన పాయల్

Payal Rajput
2020-03-23 12:08:55

సింహా, లెజెండ్‌ లాంటి సూపర్ హిట్ సినిమాల తరువాత బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మూడో సినిమా తెరకెక్కుతోంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దాని మీద క్లారిటీ లేదు. ఇప్పటికే శ్రేయ లాంటి హీరోయిన్స్ ఈ సినిమాలో నటించనున్నారని ప్రచారం జరిగింది. అయితే నిన్నటి నుండి ఈ సినిమాలో పంజాబీ బ్యూటీ పాయల్‌ రాజ్‌ఫుత్‌ హీరోయిన్ గా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ హీరోగా నటించిన ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ సినిమాలో ఒక క్యామియో చేసింది పాయల్‌. మరోసారి ఈ జంట వెండితెరపై కనువిందు చేయనుందని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చింది పాయల్. తాను బాలయ్య బాబు సినిమాలో తో నటిస్తునానన్న వార్తల్లో నిజం లేదని.. ఇప్పటివరకు తనను ఎవరు బాలకృష్ణ గారి సినిమా చేయమని తనను సంప్రదించలేదని ఇది పుకారు అంటూ చెప్పుకొచ్చింది ఆమె. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది. 

More Related Stories