English   

ఆ ప్రచారానికి తెరదించిన కాజల్

Kajal
2020-03-23 12:57:00

ఒకరకంగా ఎన్నాళ్ళ నుండో జరుగుతున్న పెద్ద ప్రచారానికి తెర వేసింది కాజల్ అగర్వాల్. విషయం ఏమిటంటే చిరంజీవి-కొరటాల సినిమాలో హీరోయిన్ గా ఎంపికయిన త్రిష ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఏవో కారణాలు చెప్పి బయటకు వచ్చేసింది. దీంతో చిరంజీవి సరసన నటించాబోయేది ఈమెనంటూ రకరకాల ప్రచారాలు జరిగాయి. ఆ ప్రచారాలు ఏవీ ఇంకా సరిగా ఎవరు హీరోయిన్ అనేది తేల్చలేదు. కానీ ఎక్కువగా అయితే కాజల్ పేరే వినిపించింది. ఇప్పుడు సినిమాలో నటించాబోయేది తానే నంటూ ఆమె క్లారిటీ ఇచ్చేసింది. 

సినిమా యూనిట్ నుండి ఎటువంటి కన్ఫర్మేషన్ లేకున్నా తన ఇన్స్టా ఫాలోవర్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చింది కాజల్. ప్రస్తుతం కరోనా దెబ్బకు ఇంటికే పరిమితం అయ్యారు అందరూ. అందుకే గతం కంటే ఇప్పుడు కొంచెం సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటున్నారు. అలా కాజల్ ని ఒకరు మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమిటని ప్రశ్నించారు. దీంతో ఆమె ఈ విషయం చెప్పుకు వచ్చింది. చిరంజీవి గారి సినిమాలో నటిస్తున్నానాన్న ఈ ముద్దుగుమ్మ షూట్ క్యాన్సిల్ అవడంతో ఇంటిదగ్గరే సినిమా కోసం హోం వర్క్ చేస్తున్నాని చెప్పుకొచ్చింది. అలా తాను ఈ సినిమాలో నటిస్తున్న విషయం మీద క్లారిటీ ఇచ్చినట్టయ్యింది.

More Related Stories