English   

కరోనా కారణంగా వాయిదా పడిన సినిమా ఓపెనింగ్స్.. 

Corona effect Tollywood
2020-03-23 13:58:44

కరోనా కారణంగా ఇండస్ట్రీ అంతా స్థంభించిపోయింది. ఎక్కడా ఏ పని కూడా జరగడం లేదు. చాలా సినిమాలు ఓపెనింగ్ జరపుకోవాల్సినవి కూడా ఆగిపోయాయి. ముఖ్యంగా అందులో కొందరు స్టార్ హీరోలు కూడా ఉన్నారు. కరోనా విలయతాండవం చేస్తుండటంతో వాళ్లు కూడా సైలెంట్ అయిపోయారు. మరి అలాంటి సినిమాలేంటో ఒక్కసారి చూద్దాం.. 

1. మహేష్, పరుశురామ్:  ఉగాదికి లాంఛ్ కావాల్సిన మహేష్ బాబు, పరుశురామ్ సినిమా ప్రస్తుతానికి వాయిదా పడింది. తర్వాత మంచి రోజు చూసుకుని ఈ చిత్రాన్ని లాంఛ్ చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. 

2. నాగార్జున బంగార్రాజు:  చాలా రోజుల నుంచి వార్తల్లోనే ఉన్న నాగార్జున బంగార్రాజు సినిమాను కూడా ఉగాదికి ఓపెనింగ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా ఈ చిత్రం కూడా వాయిదా పడింది. కళ్యాణ్ కృష్ణ దీనికి దర్శకుడు.

3. రవితేజ, త్రినాథరావ్: హలో గురు ప్రేమకోసమే సినిమా తర్వాత ఒక్కసారిగా మాయమైపోయిన దర్శకుడు త్రినాథరావు. వెంకటేష్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేసినా కూడా అది వర్కవుట్ కాలేదు. దాంతో రవితేజతో సినిమా ప్లాన్ చేసుకున్నాడు ఈయన. ఈ సినిమాను కూడా మార్చ్ లోనే మొదలు పెట్టాలనుకున్నా కూడా కుదరడం లేదు. 

4. బాలయ్య, బి గోపాల్: బాలకృష్ణ, బి గోపాల్ కాంబినేషన్ లో ఓ సినిమా రానుంది. ఇప్పటికే కథ కూడా సిద్ధమైపోయింది. ఈ చిత్ర ఓపెనింగ్ ఉగాదికి ప్లాన్ చేసాడు బాలయ్య. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. 

5. నాగ చైతన్య, విక్రమ్ కే కుమార్:  మనం లాంటి క్లాసిక్ సినిమాను ఇచ్చిన కాంబినేషన్ విక్రమ్ కే కుమార్, నాగ చైతన్య. గ్యాంగ్ లీడర్ తర్వాత ఈయన మరే సినిమా చేయలేదు. ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో నా ఆటోగ్రాఫ్ తరహా కథతో ముగ్గురు హీరోయిన్లతో నాగ చైతన్య సినిమా ప్లాన్ చేసాడు. ఈ సినిమాను ఉగాదికి లాంఛ్ చేయాలనుకుంటే కరోనా వచ్చి అడ్డకుంది. ఇంకా కొన్ని సినిమాలు కూడా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. 

More Related Stories