English   

ఉగాదికి సరిలేరు నీకెవ్వరు.. బుల్లితెరపై మహేష్ సందడి..

Sarileru Neekevvaru
2020-03-23 14:19:42

సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించిన సరిలేరు నీకెవ్వరు సినిమా మూడు నెలల లోపే టెలివిజన్ పై దర్శనమివ్వనుంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో సంచలనాలు సృష్టిస్తున్న సరిలేరు నీకెవ్వరు ఉగాది సందర్భంగా జెమినీ టీవీలో శాటిలైట్ కానుంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ దాదాపు 18 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నారు జెమినీ టీవీ. తెలుగు సినిమాలో అత్యధిక ధర పలికిన టాప్ 5 సినిమాల్లో సరిలేరు నీకెవ్వరు కూడా ఉంది. అందుకే విడుదలైన రెండు నెలల తర్వాత ఈ సినిమాను బుల్లితెరపై ప్రసారం చేస్తున్నారు. 

ప్రస్తుతానికి కరోనా వైరస్ ఎఫెక్టుతో ఇంటి నుంచి కాలు బయటకు పెట్టడం లేదు ప్రజలు.. పెట్టకూడదని ప్రభుత్వం ఆంక్షలు కూడా విధించింది. దాంతో టెలివిజన్ తప్ప వాళ్లకు మరో ఎంటర్టైన్మెంట్ లేకుండా పోయింది. అందుకే అమెజాన్ ప్రైమ్ వీడియోస్, నెట్ ఫిక్స్, ఆహా లాంటి డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ బంపర్ ఆఫర్ ప్రకటించాయి. ఇక ఇప్పుడు టెలివిజన్లో కూడా మంచి మంచి సినిమాలు వస్తే ఖచ్చితంగా టిఆర్పి రేటింగ్ కూడా భారీగానే వస్తుంది. 

దాంతో ఉగాదికి సరిలేరు నీకెవ్వరు సినిమాను ప్రసారం చేస్తుంది జెమిని టెలివిజన్. దీనికి భారీ టిఆర్పి వస్తుందని వారు అంచనాలు వేసుకుంటున్నారు. మార్చ్ 25 సాయంత్రం 5 గంటలకు సరిలేరు నీకెవ్వరు బుల్లితెరపై సందడి చేయనుంది. గతంలో కూడా మహేష్ బాబు సినిమాలు టెలివిజన్ లో సంచలనాలు సృష్టించాయి. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా ఇదే చేస్తుందని నమ్ముతున్నారు జెమిని యాజమాన్యం. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు 130 కోట్లు పైగా షేర్ వసూలు చేసింది. 

More Related Stories