English   

విజయ్ దేవరకొండ మీద రకుల్ క్రేజీ కామెంట్స్

 Rakul preet singh
2020-03-23 14:36:27

తనకు తెలుగులో విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని అప్పట్లో కామేంట్ చేసిన రకుల్ మళ్ళీ అలాంటి కామెంట్సే చేసింది. నిజానికి విజయ్ కి అమ్మాయిలలో క్రేజ్ మామూలుగా లేదు, జాన్వీ కపూర్ మొదలు, కియారా అద్వానీ, లాంటి వాళ్ళు విజయ్ అంటే తమకు ఎంత ఇష్టమో బహిరంగంగానేఒప్పుకున్నారు. ఇప్పుడు ఈ లిస్టు లో ఈ పంజాబీ భామ చేరిందన్న మాట. ఇప్పటికే మన టాలీవుడ్ లోని కుర్ర స్టార్ హీరోలు అందరితో రోమాన్స్ చేసిన ఈ భామ మొన్నీమధ్య నాగార్జునతోనూ రోమాన్స్ పండించింది. 

ఇప్పుడు కొంచెం సినిమాలు తగ్గిన నేపధ్యంలో తన జిమ్స్ మీద ద్రుష్టి పెట్టింది ఈ అమ్మడు. ఇప్పుడు కరోనా దెబ్బకు షూటింగ్స్ సహా ఈ జిమ్ములు కూడా మూత పడ్డాయి. మరి మళ్ళీ ఆఫర్స్ కోసం చూస్తుందో లేక నిజంగా విజయ్ అంటే అంత ఇష్టమో తెలియదు కానీ విజయ్ ని చూస్తే అతని నటించడానికే పుట్టాడేమో అనే అనుమానం కలుగుతూ ఉంటుందని చెప్పుకొచ్చింది. 

అంతే కాదండోయ్, తనకు ఒక్కసారయినా అతనితో నటించాలని ఉందని చెప్పుకొచ్చింది. ఆయన నటిస్తూ ఉంటే ఇంకా చూడాలని అనిపిస్తూ ఉంటుందని చెప్పుకొచ్చింది. ఎప్పుడు కుదురుతుందో తెలియదు కానీ తమ జోడీ మాత్రం హీట్ లేపడం ఖాయం అంటోంది. అలా అని దర్శక నిర్మాతలకి హింట్ కూడా ఇచ్చేస్తోంది ఈ అమ్మడు.

More Related Stories