English   

హిట్ జానర్ లో సినిమా ప్లాన్ చేసిన విక్రమ్ కుమార్...చైతూ హీరోగా 

Naga chaitanya
2020-03-23 15:00:08

మజిలీ సినిమా సూపర్ హిట్ కొట్టిన నాగ చైతన్య ఇప్పుడు లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నారు. శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా దెబ్బ గట్టిగా ఉన్నా ఎక్కడా తగ్గకుండా ఈ సినిమా తమ షూట్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు లాక్ డౌన్ కాబట్టి ఆపక తప్పని పరిస్థితి. అయితే ఆ విషయం ఎలా ఉన్నా ఇప్పుడు నాగచైతన్య తదుపరి ప్రాజెక్ట్ అంటూ ఒక సినిమా మీద చర్చ జరుగుతోంది. 

అదేమిటి అంటే ఇప్పటికే మనోడు బంగార్రాజు అనే సినిమా చేస్తున్నాడు, నాగార్జున లీడ్ రోల్ లో నటించే ఈ సినిమాలో ఈయన కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత పరశురామ్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది.  ఇక ఇప్పుడు మనం ఫేమ్ విక్రమ్ కుమార్ తో ఒక సినిమా ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. అది కూడా ఒక మంచి జోనర్ అని అంటున్నారు. గతంలో రవితేజ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమాలో ఒక మనిషికి చెందినా మూడు దశల ప్రేమలను చూపించి హిట్ కొట్టారు. ఆ తరువాత ప్రేమమ్ అనే మళయాల రీమేక్ చేసి కూడా ఒక మాదిరి హిట్ కొట్టారు. మొన్నీమధ్య కూడా కేరాఫ్ కంచరపాలెం అనే సినిమా చేసి కూడా హిట్ కొట్టారు. 

దీంతో ఈ జానర్ లో విక్రం ఒక సినిమా ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. అది కూడా నాగచైతన్య లీడ్ గా ఓకె చేసినట్టు చెబుతున్నారు. ఈ విషయం మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. నాగ చైతన్య ఇప్పటికే ప్రేమమ్ చిత్రంలో మూడు భిన్నమైన ఏజ్ గ్రూప్స్ లో కనిపించి నటించి మెప్పించాడు. మరి ఈ సినిమాలో ఏమి చేస్తాడు అనే ఆసక్తి నెలకొంది.

More Related Stories