English   

వారిది ప్రచారం మాత్రమే...రష్మిక ఏం చేస్తుందో 

Rashmika Mandanna
2020-03-23 15:30:47

కన్నడ కస్తూరి రష్మిక మందన చూడడానికి చక్కదనాల చుక్క, అయితే అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నా, ఆమెకు అవకాశం వచ్చిన్దంటే ఆమె లక్కు అక్కడే అర్ధం చేసుకోవచ్చు. ఆ లక్కే ఆమెకు ఒక లెక్కన నక్కను తొక్కినట్టు చేస్తోంది. అందుకే వరసగా సూపర్ హిట్లు ఆమె ఖాతాలో పడుతున్నాయి. 'సరిలేరు నీకెవ్వరు' .. 'భీష్మ' సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్న ఆమె, త్వరలో బన్నీతో జత కట్టనుంది. సుకుమార్ - బన్నీ కాంబినేషన్లోని సినిమాకి ఆమె ఇప్పటికే ఎంపిక అయింది. ఇప్పుడు చరణ్ సరసన ఆచార్యలోనూ నటించనుందని అంటున్నారు. అలా మన అమ్మడికి అన్నీ కలిసి వస్తున్నాయి. 

అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని నమ్మిన ఈమె ఏకంగా సినిమాల మీదే పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయిందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇప్పటికే వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న ఈమె ఐటీ ద్రుష్టిలోకూడా పడింది అంటే అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చి పడుతున్న డబ్బును ఏమి చేసుకోవాలో తెలియకనో లేక ఎక్కడ సంపాదిస్తున్ననో అక్కడే ఖర్చు పెట్టాలని ఫిక్స్ అయిందో కానీ ఇప్పుడు చిన్న సినిమాలు నిర్మించాలని భావిస్తోందట. 

నిర్మాతగా కొత్త అవతారం ఎత్తి లోబడ్జెట్లో చిన్న సినిమాలు తీయాలని భావిస్తోందని అంటున్నారు. అయితే ఈ విషయం మీద మూడు రోజుల నుండీ ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి దాకా సమంతా, కాజల్ కోడా సినిమాలు తీస్తారని ముందు నుండీ ప్రచారం జరిగింది. కానీ ఇప్పటిదాకా అవేమీ కార్యరూపం దాల్చలేదు. వీరిద్దరూ కాక రకుల్ ప్రీత్ కూడా తన తమ్ముడిని హీరోగా పెట్టి సినిమా తీయాలనుకున్నట్లుగా వార్తలు వచ్చినా అవి వార్తలు కానే మిగిలిపోయాయి. ఇప్పుడు వారిలా కాకుండా రష్మిక నిర్మాతగా మారుతుందా లేదా అనేది చూడాలి.

More Related Stories