English   

మహేష్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఈ ఏడాది ఇక లేనట్టే..

mb
2020-03-24 06:30:26

సరిలేరు నీకెవ్వరు సినిమాతో సంక్రాంతికి సంచలన విజయం అందుకున్న మహేష్ బాబు.. ఇదే ఏడాది అదే జోరులో మరో సినిమా విడుదల చేయాలని అనుకున్నాడు. అందుకే సరిలేరు నీకెవ్వరు జరుగుతుండగానే వంశీ పైడిపల్లి కన్ఫామ్ చేసి.. మే నుంచి సినిమా మొదలు పెట్టి డిసెంబర్లో విడుదల చేయాలి అనుకున్నాడు. అలా 2020 మొదట్లో చివర్లో తన సినిమాలు ఉండాలని ప్లాన్ చేస్తున్నాడు సూపర్ స్టార్. కానీ అనుకోకుండా వంశీ పైడిపల్లి సినిమా ఆగిపోవడం.. పరశురామ్ సినిమా కూడా ఇప్పట్లో ఉండకపోవడంతో అనుకోకుండా మహేష్ బాబుకు భారీ బ్రేక్ వచ్చింది. ఉగాదికి పరశురామ్ సినిమా ఓపెనింగ్ ఉన్నా కూడా కరోనా వైరస్ కారణంగా మరికొన్ని రోజులు ఆలస్యంగా మొదలు కానుంది. దానికి తోడు ఆయనకు నాగచైతన్య సినిమా కమిట్ మెంట్ కూడా ఉంది. నిజానికి చైతు సినిమాని పక్కన పెట్టి మహేష్ సినిమాను ముందు పూర్తి చేయాలనుకున్నాడు పరశురామ్. కానీ చిరంజీవి సినిమా ఉంది కాబట్టి ఆయన కోసం పరశురామ్ సినిమాను అక్టోబర్ కు పోస్ట్ ఫోన్ చేశాడు సూపర్ స్టార్. కానీ అనివార్య కారణాలతో ఆచార్య సినిమా నుంచి మహేష్ బాబు బయటికి రావడంతో ఒక్కసారిగా ఆయన ఖాళీ అయిపోయాడు. ఇప్పుడు చైతూతో సినిమాను పరశురామ్ పూర్తి చేసే వరకు మహేష్ బాబు వేచి చూడాల్సిందే. దాంతో 2020 లో రెండు సినిమాలు తీసుకురావాలని సూపర్ స్టార్ వేసిన ప్లాన్ డిజాస్టర్ అయిపోయింది. మొత్తానికి పరశురామ్ తర్వాత ఇలా ప్లాన్ ఫెయిల్ కాకూడదని నెక్స్ట్ సినిమాలపై ఇప్పటి నుంచే పోస్ట్ చేస్తున్నారు సూపర్ స్టార్.

More Related Stories