English   

ఉప్పెన హీరోయిన్ కు ఉప్పెనలా వస్తున్న అవకాశాలు..

uppena
2020-03-24 07:10:12

తెలుగు ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు కొన్నిసార్లు అలా తెలియకుండానే క్రేజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న  కొత్త హీరోయిన్ కృతి శెట్టి. 20 ఏళ్లు కూడా లేని ఈ ముద్దుగుమ్మ కొంత చూపుల్లో పడి కుర్రాళ్ళు గిలగిలా కొట్టుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన ఉప్పెన పాటలో కృతిని చూసి ఆమెతో ప్రేమలో పడిపోయారు. ఇదిలా ఉంటే తొలి సినిమా విడుదల కాకముందే ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు ఉప్పెనలా వస్తున్నాయి. నిఖిల్ హీరోగా కుమారి 21ఎఫ్ దర్శకుడు సూర్యప్రతాప్ తెరకెక్కిస్తున్న18 పేజెస్ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా ఎంపికైందని ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రానికి సుకుమార్ కథ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తుండగా కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించనున్నాడు. సుకుమార్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాతో పాటు ఈ మధ్యే హిట్ సినిమాతో హిట్ అందుకున్న కుర్ర సంచలనం విశ్వక్ సేన్ నటించనున్న పాగల్ లో హీరోయిన్ గా కృతిని తీసుకున్నారని తెలుస్తుంది. నూతన దర్శకుడు నరేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మధ్యే రానా దగ్గుబాటి చేతుల మీదుగా ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది. ఈ చిత్రాన్ని బెక్కం వేణుగోపాల్ నిర్మించనున్నాడు. ఉప్పెన విడుదల కాకముందే కృతి శెట్టి గురించి టాలీవుడ్ లో భారీగా చర్చ జరుగుతుంది. ఇక రేపు తొలి సినిమా విడుదలై సూపర్ హిట్ అయిందంటే ఈ భామ స్టార్ హీరోయిన్ కావడం ఖాయం. ఇదిలా ఉంటే ఉప్పెన ఏప్రిల్ 2న విడుదలకావాల్సి ఉండగా కరోనా ప్రభావంతో మే 7కు వాయిదా పడింది. సరిగ్గా అదే రోజు 16 ఏళ్ల కింద ఆర్య సినిమా విడుదలైంది. మళ్లీ అదే రోజు తన సినిమా విడుదల చేయాలని సుకుమార్ శిష్యుడు, ఉప్పెన చిత్ర దర్శకుడు బుచ్చిబాబు ఆలోచిస్తున్నాడు.

More Related Stories