English   

మహేష్ బాబు ఆఫర్‌కు నో చెప్పిన అనిల్ రావిపూడి..

maheshbabu
2020-03-24 07:48:02

సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ దగ్గర బాగానే మ్యాజిక్ చేసారు మహేష్ బాబు, అనిల్ రావిపూడి జంట. ఈ చిత్రం దాదాపు 130 కోట్లకు పైగానే షేర్ వసూలు చేసింది. దాంతో మహేష్ బాబుకు అనిల్ వర్కింగ్ స్టైల్ బాగా నచ్చేసింది. కేవలం ఐదు నెలల్లోనే తనతో ఇలాంటి కమర్షియల్ సినిమా చేసిన దర్శకుడిని అంత ఈజీగా వదలకూడదని ఫిక్సైపోయాడు ఈయన. అందుకే వెంటనే తనతో మరో సినిమా చేయాలని ఈ దర్శకున్ని మహేష్ కోరినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి అనిల్ సున్నితంగా నో చెప్పాడని తెలుస్తుంది. కేవలం మూడు నెలలు మాత్రమే టైమ్ ఇచ్చి తన కోసం కథ సిద్ధం చేయాల్సిందిగా మహేష్ కోరడంతో మరో ఆలోచన లేకుండా ఈయన నో చెప్పాడని ప్రచారం జరుగుతుంది. అంత తక్కువ సమయంలో క్వాలిటీ స్క్రిప్ట్ సిద్ధం చేయడం కష్టమని భావించిన అనిల్ రావిపూడి లేనిపోని రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక వద్దని చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. తనకు టైమ్ ఇస్తే మరోసారి మంచి స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని వస్తానని చెప్పినా కూడా మహేష్ మాత్రం తొందర పడుతున్నాడని తెలుస్తుంది. ఈ కాంబినేషన్‌లో సినిమా కోసం మహేష్ అభిమానులు కూడా వేచి చూస్తున్నారు. ప్రస్తుతం ఎఫ్-2 కి సీక్వెల్ ఎఫ్-3 సినిమా చేసే పనిలో బిజీగా ఉన్నాడు. తన ఇంట్లోనే మేడపై కూర్చుని సెకండాఫ్ సిద్ధం చేస్తున్నాడు ఈయన. ఇందులో కూడా వెంకటేష్, వరుణ్ తేజ్ నటించబోతున్నారు.. వాళ్లకు తోడు మహేష్ బాబు కూడా ఉన్నాడనే వార్తలొచ్చాయి. మొత్తానికి మహేష్ బాబు ఇచ్చిన అవకాశాన్ని మెల్లగా అనిల్ కాదని తప్పించుకున్నాడనే ప్రచారం ఇండస్ట్రీలో అయితే జోరుగానే వినిపిస్తుంది.

More Related Stories