English   

పవన్ ఎన్టీఆర్ లపై కేజీఎఫ్ డైరెక్టర్ సంచలన కామెంట్స్

Jr NTR Pawan
2020-03-24 11:32:05

తెలుగు డైరెక్టర్ కాకపోయినా ఇప్పుడు తెలుగు వాళ్ళు ఆయన సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన తీసిన మొదటి సినిమానే సూపర్ కాదు బంపర్ హిట్ కావడంతో మన తెలుగు హీరోల అభిమానులు మా వాడితో కూడా ఒక సినిమా చేస్తే బాగుండు అనే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఎవరో మీకు అర్ధం అయ్యే ఉంటుంది. అవును ఆయనే ప్రశాంత్ నీల్. కన్నడ కేజీఎఫ్ ని తెరకెక్కించిన దర్శకుడు. కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలోనే కాదు తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఎవరూ ఊహించని విధంగా ఈ కన్నడ సినిమా ప్రపంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 250 కోట్లు వ‌సూలు చేసి రికార్డులు సృష్టించింది. 

ఈ మొదటి భాగం హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా కె.జి.ఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ దర్శకుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలుగు స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లను ప్రసంశలతో ముంచెత్తాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ మరొకరికి సాధ్యం కాదని అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన మరొకరు భర్తీ చేయలేనిది అని చెప్పుకొచ్చారు. 

ఇక దర్శకదీరుడు రాజమౌళి గురించి మాట్లాడుతూ ఆయన మిగిలినవారందరికి సరికొత్త దారి చూపించిన దర్శకుడని తాను ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చాడు. ఇక నిజానికి ఈయన మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లకి కధలు చెప్పినట్టు ప్రచారం జరిగింది. చూడబోతే మనోడు ఎన్టీఆర్ సినిమా చేసినా చేసేస్తాడని ఇప్పుడు ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. 

More Related Stories