English   

కన్నడ సూపర్ స్టార్ టాలీవుడ్ రీ ఎంట్రీ 

 Shiva Rajkumar
2020-03-24 11:47:43

మనకి తెలుగులో ఎలా అయితే నందమూరి, అక్కినేని కుటుంబాలు ఉన్నాయో అలానే కన్నడలోనూ రాజ్ కుమార్ ఫ్యామిలీ ఎప్పటి నుండో సినిమా రంగంలో ఉంది. ఒకప్పుడు స్టార్ హీరోగా రాజ్ కుమార్ చక్రం తిప్పగా ఆయన తరువాత ఆయన ముగ్గురు కొడుకులు కూడా కన్నడ సినిమాల్లో తమ సత్తా చాటారు. పెద్దోడు శివ రాజ్ కుమార్ హీరోగా అక్కడ చక్రం తిప్పాడు. రెండో కొడుకు రాఘవేంద్ర కూడా అక్కడి సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు, నిర్మాతగా, సింగర్ గా ఆయన తన ప్రతిభ చాటుకున్నాడు. ఇక మూడ్దో వాడు అయితే కన్నడ పవర్ స్టార్ హోదా అనుభవిస్తున్నాడు. 

అయితే ఇప్పుడు శివరాజ్ కుమార్ టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇస్తున్నారన్న వార్త హైలైట్ అవుతోంది. శివ రాజ్ కుమార్ ఆర్జీవి తీసిన “కిల్లింగ్ వీరప్పన్” మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ సినిమా అప్పట్లో బానే ఆడింది. ఆ తరువాత బాలయ్యతో ఉన్న స్నేహంతో సూపర్ హిట్ “గౌతమి పుత్ర శాతకర్ణి” మూవీలో ఒక పాటలో అతిథి పాత్రలో గొంతు కలిపి తెలుగు ప్రేక్షకులను అలరించారు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు శివరాజ్ కుమార్ హీరోగా కన్నడ , తెలుగు భాషలలో ఒక సినిమా తెరకేక్కనుందట. ఈ సినిమా గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు కానీ ఇది ఆయన రీ ఎంట్రీ సినిమా అని మాత్రం అంటున్నారు.  

More Related Stories