English   

ఆర్ఆర్ఆర్ నుండి అలియా భట్ అవుట్ కాదట 

 Alia Bhatt
2020-03-24 12:06:50

ఇప్పుడున్న తెలుగు సినిమాల్లో దేనిని అయినా ఒక రేంజ్ లో చర్చించుకుంటున్నారు అంటే అది ఆర్ఆర్ఆర్ అనే చెప్పాలి. ఈ సినిమా అనౌన్స్ చేసిన రాజమౌళి ఆ తరువాత ఈ సినిమా గురించి ఏమీ ప్రకటించకపోయే సరికి ఈ సినిమా గురించి రోజుకు వంద పుకార్లు పుట్టుకొచ్చేవి. దీంతో ఎందుకు వచ్చిన గోల అనుకుని ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్నిటికీ క్లారిటీ ఇచ్చాడు. అయినా ఇప్పటికీ ఆ పుకార్లు ఆగలేదు. కానీ ఈ మధ్య మరో సారి ఆ సినిమా వార్తల్లోకి ఎక్కింది. ఎందుకంటే ఈ సినిమా నుండి అలియా భట్ తప్పుకుంటుందనే వార్త కొద్ది రోజులుగా వెబ్ సైట్ లలో హల్చల్ చేస్తోంది. వినడానికి నమ్మసఖ్యంగా లేకున్నా ఇది నిజమేనని ప్రచారం జరిగింది.

 

ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 80 శాతం మేర ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా సెప్టెంబర్ కల్లా షూటింగ్ ను కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. అయితే ఈ సినిమాకి కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. కరోనా వలనే సినిమా నుండి అలియా భట్ తప్పుకున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆమె పూనే షెడ్యూల్ లో జాయిన్ కావాల్సి ఉంది. కానీ కరోనా దెబ్బకు పూనే షెడ్యూల్ క్యాన్సిల్ చేసి ఇక్కడే షూట్ చేస్తున్నారు రాజమౌళి. ఇప్పుడు అలియ ఇచ్చిన డేట్స్ అన్నీ వెస్ట్ అయిపోతున్నాయని అందుకే ఆమె మళ్ళీ డేట్స్ సర్ధలేక సినిమా నుండి వెళ్లిపోతున్నట్టు ప్రచారం జరుగింది. 

అయితే ఇప్పుడు ఆ వార్తలు తప్పని తేలి పోయింది. ఆర్ఆర్ఆర్ నుండి అలియా తప్పుకుందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదనీ ప్రచారం జరుగుతున్నట్టు ముందు డేట్స్ సమస్య వచ్చినప్పటికీ ఆమె చొరవ తీసుకుని మళ్ళీ సర్దుబాటు చేసిందని చెబుతున్నారు. ఈ సినిమా కోసం మే నుండి ఆమె షూటింగ్ లో పాల్గొనబోతుందని కూడా తాజాగా ఆర్ఆర్ఆర్ టీమ్ తెలిపింది. కరోనా వైరస్ కారణంగా పూణే షెడ్యూల్ వాయిదా పడిందని, పరిస్థితులు చక్కబడిన తరువాత ఈ సినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభం అవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. సో అలియా భట్ అవుట్ అనే వార్త ఒట్టి పుకారు అని తెలిపోయిందన్నమాట.  

More Related Stories