English   

మరో బయోపిక్ ఒప్పుకున్న సూర్య 

 Suriya
2020-03-24 12:19:07

సూర్య వరుస బయోపిక్స్ ఒప్పుకుంటున్నట్టున్నాడు. ఇప్పటికే ఆయన సుధా కొంగ‌ర ద‌ర్శక‌త్వంలో ‘శూర‌రై పోట్రు’ అనే సినిమా చేస్తున్నాడు. తెలుగులో ఈ సినిమాని ‘ఆకాశం నీ హ‌ద్దురా’ పేరుతో విడుద‌ల‌ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కు సిద్దం అవుతోంది. తెలుగు విలక్షణ నటుడు మోహన్ బాబు నటించిన ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాల‌ను జ‌రుపుకుంటోంది. డెక్కన్‌ ఎయిర్‌వేస్‌ అధినేత గోపీనాథ్‌ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత ఆయన హ‌రి ద‌ర్శక‌త్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా పూర్తీ కాగానే జ్ఞాన‌వేల్ అనే ద‌ర్శకుడు తెర‌కెక్కించ‌బోయే సినిమాలో సూర్య న‌టించ‌బోతున్నార‌ట‌. అయితే అది కూడా బ‌యోపిక్ అని కోలీవుడ్ వ‌ర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దర్శకుడు సూర్యకు కథ వినిపించాడని, సూర్య కూడా కధ నచ్చడంతో దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడని వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయం మీద స్పష్టత రానున్నట్టు చెబుతున్నారు. అయితే మరి ఈ బయోపిక్ ఎవరిదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More Related Stories