English   

మళయాల రీమేక్ లో బాలయ్య...మల్టీ స్టారరట 

Balayya
2020-03-24 12:30:46

నందమూరి బాలకృష్ణ టైం ఈ మధ్య అస్సలు బాలేదు. మా అమ్మా నాన్న కధ చెబుతున్నా అంటూ ఆయన నటించి నిర్మించిన బయోపిక్ సిరీస్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆ తరువాత రూలర్ అనే సినిమా చేసినా అది కూడా వర్కౌట్ కాలేదు. దీంతో ఆయన తనకు రెండు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన బోయపాటితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన తనకు నాలుగు హిట్స్ ఇచ్చిన బీ గోపాల్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఆ విషయం మీద ఇంకా క్లారిటీ రాకుండానే బుర్రా సాయి మాధవ్ డైరెక్షన్ డెబ్యూ మూవీ కూడా ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఆయనకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త ప్రచారంలోకి వచ్చింది. 

అదేంటంటే త్వర‌లో బాలయ్య ఒక రీమేక్ ఫిల్మ్ లో న‌టించే అవ‌కాశ‌ముందని అంటున్నారు. అది కూడా ఓ మ‌ల్టీస్టార‌ర్ స‌బ్జెక్ట్ అని అంటున్నారు. విషయం ఎంతంటే మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్` సినిమా హక్కులు సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ కొనుక్కుంది. అయితే ఇప్పుడు ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారట. ఇది మల్టీ స్టార్ట్ అని అందులో ఒక పాత్ర బాలయ్య చేస్తే బావుంటుంద‌ని నిర్మాత సూర్యదేవ‌ర నాగ‌వంశీ భావిస్తున్నార‌ట‌. ఇప్పటికే ఈ కధను బాలయ్యకు కూడా వినిపించారని త్వర‌లోనే ఈ సినిమా రీమేక్ మీద క్లారిటీ రావచ్చని అంటున్నారు.

More Related Stories