English   

భీష్మ హిందీ రీమేక్.. హీరో ఎవరో తెలుసా..

Karan Johar
2020-03-24 13:34:28

తెలుగు సినిమాలపై ఇప్పుడు నేషనల్ వైడ్ ‌గా చర్చ జరుగుతూనే ఉంది. మన సినిమాలను చూసి బాలీవుడ్ కూడా నివ్వెరపోతుంది. ఇక్కడ సినిమాలు హిట్టైతే చాలు.. వెంటనే బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు భీష్మ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. నితిన్ హీరోగా వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ చిత్రం 30 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. అ..ఆ తర్వాత నితిన్ కు వచ్చిన హిట్ ఇదే. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం సేంద్రీయ వ్యవసాయం చుట్టూ తిరిగింది. ఈ కథకు మంచి అప్లాజ్ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి చూస్తున్నారు.

ఈ చిత్ర హిందీ రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ భారీ రేటుకే దక్కించుకున్నట్టు తెలుస్తుంది. అక్కడ ఈ చిత్రాన్ని రణ్‌బీర్ కపూర్‌ లేదంటే వరుణ్ ధావన్ లలో ఎవరో ఒకరితో రీమేక్ చేయాలని చూస్తున్నాడు ఈ నిర్మాత. ఇప్పటికే ఈయన విజయ్ దేవరకొండ ఫ్లాప్ మూవీ డియర్ కామ్రేడ్ హక్కులను తీసుకుని ఏం చేయాలో తెలియక చూస్తున్నాడు. ఈ సినిమాను పూర్తిగా మార్చి తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడు ఈయన. మొత్తానికి తెలుగు సినిమాలను బాగానే కొంటున్నాడు కరణ్ జోహార్. అంతేకాదు మన సినిమాలను హిందీలో విడుదల చేయడానికి కూడా హెల్ప్ చేస్తున్నాడు కరణ్ జోహార్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫైటర్ సినిమాను హిందీలో ఆయనే విడుదల చేయబోతున్నాడు. పూరీ జగన్నాథ్ దీనికి దర్శకుడు. అనన్య పాండే ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ఇదే ఏడాది సినిమా విడుదల కానుంది.

More Related Stories