English   

తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసిన నితిన్.. 

nithiin
2020-03-24 15:48:26

కరోనా కారణంగా నష్టపోతున్న వాళ్లను ఆదుకోడానికి కుర్ర హీరో నితిన్ ముందుకొచ్చాడు. ఈయన తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన నివాసంలో కలిసాడు. కరోనా బాధితుల సహాయార్థం రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 10 లక్షల చొప్పున ప్రకటించాడు నితిన్. ఇప్పుడు ఈ చెక్ ఇవ్వడానికి ఆయన కేసీఆర్ ను కలిసాడు. మొన్నీమధ్యే భీష్మ సినిమాతో హిట్ కొట్టిన ఈయన.. రీల్ హీరో అనిపించుకున్నాడు కానీ ఇప్పుడు రియల్ హీరో కూడా అయిపోయాడు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 20 లక్షల రూపాయలు కరోనా కట్టడి కోసం ఇచ్చాడు ఈయన. 

ఇప్పటికే కరోనా బాధితుల సహాయార్థ ఇండస్ట్రీ నుంచి ప్రకాశ్ రాజ్, రాజశేఖర్ లాంటి వాళ్లు సినిమా కార్మికులకు తమ వంతు సాయం చేయడానికి ముందుకొచ్చారు.. చేస్తున్నారు కూడా. ఇప్పుడు వీళ్లకు తోడుగా నితిన్ కూడా జత కలిసాడు. తమిళనాట కూడా అక్కడ స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తి జనాలకు సాయం చేస్తున్నారు. రజినీకాంత్ కూడా సినిమా వాళ్ల కోసం 50 లక్షలు విరాళం అందించాడు. 

టాలీవుడ్‌లో మాత్రం తమ ఫొటోలతో, వీడియోలతో సోషల్ మీడియాను నింపుతున్నారు కానీ డబ్బులు రావడం లేదు. కానీ కొందరు మాత్రం ముందుకొస్తున్నారు. అందులో నితిన్ చేరిపోయాడు. ఈయన తన వంతు సాయంగా ఆంధ్ర, తెలంగాణలకు చెరో 10 లక్షలు ప్రకటించాడు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు ఈయన సాయం చేసాడు. నితిన్ చేసింది చూసిన తర్వాతైనా మరికొందరు హీరోలు ముందుకొస్తారని అంతా భావిస్తున్నారు. 

More Related Stories