English   

సోషల్ మీడియాలోకి చిరంజీవి మెగా ఎంట్రీ..

Chiranjeevi
2020-03-24 17:50:11

ఈ రోజుల్లో స్టార్ హీరోలు తమ అభిమానులతో ఏమీ పంచుకోవాలనుకున్నా.. తమ అభిప్రాయాలను వాళ్లకు చెప్పాలనుకున్నా ముందుగా గుర్తొచ్చేది సోషల్ మీడియా. అభిమానులకు హీరోలకు మధ్య వారధిగా సోషల్ మీడియా ఉంటుంది. అందుకే చాలా మంది హీరోలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. మహేష్ బాబు, రానా దగ్గుబాటి, అల్లు అర్జున్ లాంటి హీరోలు ఎప్పుడు ట్విట్టర్లో ఇంస్టాగ్రామ్ లో తమ అప్డేట్స్ పోస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే చేయాలని ఫిక్స్ అయిపోయాడు. తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకోవాలంటే సోషల్ మీడియా ఒక్కటే వేదికగా తాను భావిస్తున్నట్లు చెప్పాడు చిరంజీవి. 

అందుకే ఈ ఉగాది పర్వదినం నుంచి తాను కూడా సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వబోతున్న ట్లు ప్రకటించాడు మెగాస్టార్. ఇప్పటివరకు చిరంజీవికి ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ అకౌంట్ లేదు. ఇప్పుడు తెలుగు సంవత్సరాది కానుకగా అభిమానులకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పబోతున్నాడు చిరంజీవి. ఇప్పటి నుంచి తన అభిప్రాయాలను, సినిమా అప్ డేట్స్ అన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను అంటున్నాడు చిరు. మొత్తానికి అన్నయ్య సోషల్ మీడియా ఎంట్రీ ఇస్తుండడంతో అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు.. 

More Related Stories