English   

కరోనా వైరస్ ను అలా వాడుకున్న రజినీకాంత్..

rajni
2020-03-25 06:42:13

ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో కూడా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ వైరస్ ను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. అదెలా సాధ్యం అని ఆశ్చర్య పోవద్దు. ఈయన ఆ మధ్య ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ షో "మ్యాన్ వర్సెస్ వైల్డ్" లో కనిపించాడు. భారతదేశం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తర్వాత రజినీకాంత్ కే ఈ అవకాశం దక్కింది. ఇండియాలో సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న పాపులారిటీ తెలుసుకొని ఆ షో నిర్వాహకులు మన సూపర్ స్టార్ తో ఒక ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఇక ఇప్పటికే విడుదలైన ప్రోమోలు ఈ ఎపిసోడ్ పై ఎక్కడలేని అంచనాలు పెంచేశాయి. ముందు నుంచి కూడా రజనీకాంత్ ఎపిసోడ్ ను మార్చ్ 23నే టెలికాస్ట్ చేస్తామని చెబుతూ వచ్చారు.

దీనికి ముందు నరేంద్ర మోదీతో చేసిన ఎపిసోడ్ రికార్డు వ్యూవర్ షిప్ తో పాటు టిఆర్పి రేటింగ్స్ కూడా అధికంగా తీసుకొచ్చింది. దాంతో రజనీకాంత్ ఎపిసోడ్ కు మరింత ఎక్కువ టిఆర్పి వస్తుందని వారు భావిస్తున్నారు. నిజానికి ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తామని చెప్పినప్పుడు కరోనా వైరస్ ప్రభావం ఎక్కడా లేదు. కానీ ఇప్పుడు ఇంటి నుంచి కాలు బయటకు పెట్టకూడదని దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు ఆజ్ఞలు జారీ చేశాయి. దాంతో అంతా ఇంటికే పరిమితం అయిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో రజినీకాంత్ తొలిసారి తెలుగు తెరపై కనిపించిన షో ప్రసారం అవుతుంది. అందుకే మ్యాన్ వెర్సెస్ వైల్డ్ హోస్ట్ బేర్ గ్రిల్స్ తో మన సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన సాహసాలను టీవీల్లో ఎక్కువగానే చూసినట్టు తెలుస్తుంది. దీని టిఆర్పి రేటింగ్ బయటకు వస్తే కచ్చితంగా కొత్త రికార్డు సృష్టించడం ఖాయం అంటున్నారు అభిమానులు.

More Related Stories