English   

నిర్మాత ఆత్మహత్య.. విషాదంలో ఇండస్ట్రీ..

kapilmohan
2020-03-25 07:03:25

ఈ మధ్య ఇండస్ట్రీలో విషాదాలు వరసగా జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న నటుడు ఆనంద్ రాజ్ తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. అది మరిచిపోకముందే మరో ప్రముఖులు కూడా సూసైడ్ చేసుకున్నాడు. కన్నడ సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నిర్మాత కపాలి మోహన్ మార్చ్ 23 రాత్రి సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని కన్నుమూసాడు. కన్నడ సినీ పరిశ్రమలో బాగానే సుపరిచితుడు ఈయన. కొన్నేళ్లుగా ఈయన తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. అప్పులు కూడా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. దాంతో తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయాడు మోహన్. కొన్నాళ్లుగా సినిమా నిర్మాణాలకు దూరంగా ఉన్న ఈయన హోటల్ బిజినెస్ చేస్తున్నాడని తెలుస్తుంది. కానీ అందులో కూడా నష్టాలు రావడంతో కోలుకోలేకపోయాడు మోహన్.

ఆర్థిక సమస్యలు కూడా తీవ్రతరం కావడంతో చావు ఒక్కటే మార్గం అనుకున్నాడు. తన స్నేహితుడు మంజునాథ్ తో కలిసి భోజనం చేసిన మోహన్ ఆ తర్వాత తన హోటల్ కు వెళ్లి స్నేహితుడితో పాటు పడుకున్నాడు. అయితే అదే సమయంలో స్నేహితుడు ఘాడ నిద్రలో ఉన్నపుడు ఈయన అదే రూమ్ లో ఉన్న ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు. మోహన్ ఉరి వేసుకోవడానికి ముందు ఒక సెల్ఫీ వీడియోను రికార్డు చేశాడు. ఆ వీడియోలో తాను ఆర్థికంగా చాలా చితికి పోయానని.. తాను చేస్తున్న హోటల్ వ్యాపారంలో తీవ్ర నష్టాలు వస్తున్నాయని చెప్పాడు. అందుకే తను చనిపోతున్నట్లు కూడా వివరించాడు. తన కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కర్ణాటక సీఎం యడ్యూరప్పకు నిర్మాత మోహన్ విజ్ఞప్తి చేశాడు. తన చావుకు ఆర్ధిక సమస్యలే తప్ప మరే కారణం కాదని ఆయన వీడియోలో క్లారిటీగా చెప్పాడంటూ పోలీసులు నిర్థారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యగా నిర్థారించినట్లుగా ప్రకటించారు. ఈయన మృతితో కన్నడ చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

More Related Stories