English   

సెల్ఫ్ క్వారెంటైన్ లో శృతి హాసన్...ముద్ర వేశారు

Shruti Haasan
2020-03-25 11:39:04

కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఇప్పటికే భారత్ లాంటి దేశం లాక్ డౌన్ ప్రకటించింది అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ ఎఫెక్ట్ అన్ని రంగాలాతో సహా సినిమా రంగం మీద కూడా పడింది. విదేశాల్ల్లో షూట్ లు చేసుకుంటున్న మన నటులు కూడా సైలెంట్ గా ఇండియా వచ్చేసారు. ప్రభుత్వ నిభందనలు అనుసరించి వారంతా హోం క్వారంటైన్ లో ఉంటున్నారు. ఈ మధ్య ప్రభాస్ లాంటి వాళ్ళు షూటింగ్ నిమితం వెళ్ళి తిరిగి వచ్చారు. ఆయన ఆ ప్రభావం ఉండకుండా ప్రభాస్ స్వీయ నిర్బంధంలో ఉన్నారు. 

తాజాగా హీరోయిన్ శృతి హాసన్ కూడా అదే బాటలో పయనించినట్టు చెబుతున్నారు. 10 రోజుల కిందటే లండన్ నుంచి వచ్చిన హీరోయిన్ శృతిహాసన్ కి ఎయిర్ పోర్ట్ లో ధర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. అందులో ఎటువంటి తేడా లేకున్నా ముందస్తు జాగ్రత్తలలో భాగంగా చేతికి సెల్ఫ్ క్వారంటైన్ ముద్ర కూడా వేశారు. దీంతో ఆమె ఇంటి నుంచి బయటకు రావడం లేదట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియచేసింది ఇలా ఏకాంతంగా గడపడం తనకి కొత్తేం కాదని, ఈ క్వారంటైన్ టైమ్ లో కుకింగ్, బేకింగ్,  ఆర్గానిక్ సబ్బులు కూడా తయారుచేస్తున్నానని చెప్పుకొచ్చింది. 

ఇంట్లో ఇలా మరో ఆప్షన్ లేకుండా ఉండడం కాస్త ఇబ్బంది అనిపిస్తున్నప్పటికీ.. బయట ఏం జరుగుతుందో అనే భయంతో పోలిస్తే ఇది చాలా చిన్న విషయం అంటూ ఆమె పేర్కొంది. అయితే వీరి తండ్రి కమల్ హాసన్, చెల్లి అక్షర హాసన్ కూడా విదేశాలకు వెళ్లి వచ్చారు. దీంతో వాళ్లు కూడా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారు. అయితే తాము ఒకరినొకరు కలుసుకోకుండా వేర్వేరు ఇళ్లల్లో ఉంటున్నామని శృతిహాసన్ పేర్కొంది.

More Related Stories