English   

ట్విట్టర్ లోకి మెగా స్టార్...ఎంట్రీ అదిరింది గురూ

Chiranjeevi Twitter.jpg
2020-03-25 14:18:56

ప్రకటించినట్టుగానే మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి అడుగు పెట్టారు. నిన్న పేర్కొన్నట్టుగానే ఈ ఉగాది నాడు ఆయన ట్విట్టర్ అకౌంట్‌ ను ప్రారంభించి మొదటి పోస్ట్ చేశారు. సరిగ్గా 11 గంటల 11 నిమిషాలకు ఆయన మొదటి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఆయన తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ట్వీట్ యధాతంగా ‘‘అందరికీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు. నా తోటి భారతీయులందరితో, తెలుగు ప్రజలతో, నాకు అత్యంత ప్రియమైన అభిమానులందరితో నేరుగా ఈ వేదిక నుంచి మాట్లాడగలగటం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ సంవత్సరాది రోజు ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని కలిసికట్టుగా జయించడానికి కంకణం కట్టుకుందాం. ఇంటి పట్టునే ఉందాం. సురక్షితంగా ఉందాం’’ అని ట్వీట్‌లో చిరంజీవి పేర్కొన్నారు.

అలాగే దానికి కొనసాగింపుగా మరో ట్వీట్ లో ‘‘21 రోజులు మనందరినీ ఇళ్లలోనే ఉండమని మన భారత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం కరోనా మహమ్మారిని ఎదర్కోవటానికి ఓ అనివార్యమైన చర్య. ఈ క్లిష్ట సమయంలో మనం, మన కుటుంబాలు, మన దేశం సురక్షితంగా ఉండటానికి మన ప్రియ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, మన ప్రియ ముఖ్యమంత్రులు శ్రీ కేసీఆర్ గారు, శ్రీ జగన్ గారు ఇచ్చే ఆదేశాలను పాటిద్దాం. ఇంటు పట్టునే ఉందాం. సురక్షితంగా ఉందాం’’ అని పేర్కొన్నారు. చిరంజీవి చేసిన రెండు ట్వీట్లకి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. అంతే కాక ఆయనకి అప్పుడే నలభై ఎనిమిది వేల మంది ఫాలో అయ్యారు కూడా. చూద్దాం మెగా మానియా ఈ లెక్కలను ఎక్కడిదాకా తీసుకెళ్తున్దో. 

More Related Stories