English   

చిరంజీవి చిన్నల్లుడితో చిన్నారి పెళ్లికూతురు 

 Avika Gor
2020-03-25 15:45:24

విజేత సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెగా స్టార్‌ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ఆ సినిమాతో డీసెంట్ నటుడిగా పేరు సంపాదించారు, ఇక ఆయన హీరోగా మరో సినిమా ఒకే అయిన సంగతి తెలిసిందే. జీఏ 2 పిక్చర్స్‌ సమర్పణలో పీపుల్ మీడియా ఫాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తోంది. నమో వెంకటేశ, దూకుడు లాంటి సినిమాలకి రచయితగా చేసిన శ్రీధర్‌ సీపాన ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవనున్నాడు. 

అయితే ఈ సినిమాలో కళ్యాణ్ సరసన చిన్నారి పెళ్లి కూతరుగా బుల్లితెరకి పరిచయమైన అవికా గోర్‌ నటించనుందని అంటున్నారు. కరోనా ఎఫెక్ట్ తగ్గాక ఈ సినిమా సెట్స్‌ మీదకి వెళ్లనుందట. అవికా తొలుత ‘ఉయ్యాల జంపాలా’ చిత్రంలో నటించి అలరించింది. ఆ తరువాత ‘సినిమా చూపిస్తమావ’, లక్ష్మీ రావేమా ఇంటికి అనే సిన్మాలు చేసినా పెద్దగా ఆడలేదు. మొన్నీమధ్య ‘రాజుగారి గది3’లో నటించి హిట్ అందుకుంది. ఆ భామ ఇప్పుడు కళ్యాణ్ సరసన నటించనుందని అంటున్నారు.  

More Related Stories